ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ముద్ర‌గ‌డ ఏం చేశాడు

tt804502010

ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే `తూర్పు` ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. ఉద్రిక్త‌త‌త‌ల‌తో అట్టుడికిపోయింది.. రైల్‌రోకో, రాస్తారోకోల‌తో ఉద్రిక‌త్త‌మైంది. మ‌రి ఇంత‌టి హింసాఘ‌ట‌న‌ల‌కుకార‌ణ‌మైన వ్య‌క్తి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. ఆయ‌న ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఇంతటి విధ్వంసానికి పాల్ప‌డ్డారు. అయితే ఆయ‌న ఇంత స‌డ‌న్‌గా కాపు ఉద్య‌మాన్ని త‌న భుజ‌స్కందాల‌పై వేసుకోవ‌డానికి కార‌ణాలు ఏమైనా అయ్యుండ‌చ్చు.. అయితే ఆయ‌న గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన‌ప్పుడు జ‌రిగిన విష‌యాల‌ను ఆ జిల్ల‌కు చెందిన కాపు నేత‌, హోంమంత్రి చిన‌రాజ‌ప్ప దృష్టిపెట్టారు. ఆయ‌న కాపుల‌కు ఏం చేశారో గుర్తుచేస్తున్నారు.
`ఆయనేదో కాపులను ఉద్ధరించినట్లు. కాపులు బీసీల్లో చేర్చే ప్రక్రియ ఆయన వల్లే జరుగుతుందన్నట్లు. ఇంక ఎవరూ పట్టించుకోనట్లు మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కాపులు తన వద్దకు రావొద్దంటూ ఆయన బోర్డులు పెట్టారు. మేము కాపులకు న్యాయం చేయాలని, బీసీలకు ఇబ్బంది లేకుండా చేయమని సీఎంను కోరాం. సమావేశం పెట్టవద్దని ఎవరూ అనరు. ఆ సభకు ప్రభుత్వం కూడా సహకరించింది. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. వైకాపా గూండాలు అక్కడికి వచ్చారు. రైలు, పోలీ్‌సస్టేషన్లు తగులబెట్టారు. అయినా పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని చెప్పి బెదిరించడం కరెక్ట్‌ కాదు.’ అంటూ ముద్రగడపై డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు.
గాంధీ మార్గంలో పోరాటం చేస్తామని ప్రకటించి, రైలు ఎందుకు తగులపెట్టారని ప్రశ్నించారు. ఈ సభ వెనక వైకాపా హస్తం ఉందని 15 రోజుల కిందటే చెప్పానని గుర్తుచేశారు. ఇదంతా వైకాపా ముసుగులో చేస్తున్నారని, తిరుపతికి చెందిన కరుణాకర్‌రెడ్డి 10 రోజుల ముందు అక్కడికి వెళ్లి, ఆర్థిక సహాయం చేసి వెనకుండి నడిపించారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏరోజూ కాపుల గురించి ప్రస్తావించలేదని, బొత్స లాంటి నాయకులు పదేళ్లు మంత్రిగా ఉండి కూడా కాపులను పట్టించుకోలేదన్నారు. మ‌రి కాపు నేత‌పై ఎద‌రుదాడి చేసేందుకు టీడీపీ కాపు నేత‌నే రంగంలోకి దించి ముద్ర‌గ‌డ ర‌హ‌స్యాలు బ‌య‌ట పెట్టించింది.

జుట్టును పెంచే ఆహారాలు ఉన్నాయా?

hair-growing-02323

పుష్టికరమైన ఆహారం అందమైన కేశాలకు వరంలాంటిది. నిజానికి ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మంచి ఆహారాలు అంటూ ఏమి లేవు. మనం తీసుకొనే ఆహారంలోనే సమతౌల్యత పాటిస్తే సరిపోతుంది. పోషక విలువలు లేని ఆహారాన్ని తీసుకుంటే ముఖంలో కాంతి,జుట్టులో మెరుపు తగ్గిపోతుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. అంతేకాక జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే విటమిన్స్,ప్రోటీన్స్ కూడా చాలా అవసరం. ఈ విటమిన్స్, ప్రోటీన్స్ ఏ ఆహారాల్లో లభ్యం అవుతాయో తెలుసుకుందాం.
ప్రోటీన్స్ : పాలు,పన్నీర్,మాంసం,చేపలు వంటి వాటిలో సమృద్దిగా లభిస్తాయి.
విటమిన్ ‘ఎ’ : వెన్న,గుడ్డు, పాలు,క్యారెట్,టమోటా,ఆకుపచ్చని కూరలు,కాయగురల్లో సమృద్దిగా లభిస్తుంది.
విటమిన్ ‘బి’ : పాలు,గుడ్లు,అక్రోట్స్, సోయా బీన్స్,చేపలు,మాంసం వంటి వాటిలో సమృద్దిగా లభిస్తుంది.
విటమిన్ ‘సి’ : అరటి,ఆకుపచ్చని కూరలు, నిమ్మ,నారింజ వంటి వాటిలో లభిస్తుంది.
విటమిన్ ‘డి’ : గుడ్లు,పాలు లాంటి వాటితో పాటు సూర్య కిరణాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

`క్రిమినల్` పదానికి చొక్కా తొడిగితే అది జగనే

0108452102222

తుని కాపు గ‌ర్జ‌న స‌రికొత్త వివాదాల‌కు దారితీస్తోంది. అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మ‌ళ్లీ మాటల యుద్ధం జ‌రుగుతోంది. అసెంబ్లీ స‌మావేశాలు మొద‌లైన వాటి నుంచి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌, వైకాపా అధినేత జ‌గ‌న్ మ‌ధ్య వివాదం న‌డుస్తోంద‌న్న విష‌యం తెలిసిందే! ఇప్పుడు వీరి మ‌ధ్య ప్ర‌త్య‌క్ష యుద్ధం మొద‌లైంది. కాపు నాయకుడిగా పేరొందిన వంగ‌వీటి రంగాను కోడెల శివ‌ప్ర‌సాద్ హ‌త్య చేయించార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది.
వంగవీటి రంగాను హత్య చేయించిన కోడెల శివప్రసాదరావును స్పీకర్‌ను చేసిన క్రిమినల్ చరిత్ర చంద్రబాబుదని వైకాపా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై కోడెల తీవ్రంగా స్పందించారు. వారానికొసారి కోర్టు బోనులో నిలబడే జగన్‌ రాజకీయ విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిమినల్ అన్న పదానికి చొక్కా తొడిగితే అది జగనేనని విమర్శించారు. రంగాతో తనకు స్నేహం గానీ, వైరం గానీ లేదని కోడెల చెప్పారు. రంగా హత్య తర్వాత దాడులు, లూటీలు జరిగాయని అందుకు మనస్తాపంతో హోంమంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. జగన్‌ ప్రోత్సహించిన రౌడీ మూకలే తునిలో విధ్వంసం సృష్టించాయని జనం భావిస్తున్నాయ‌ని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నేరాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగనేనని కోడెల ఫైర్ అయ్యారు. జగన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదన్నారు. అద్దం ముందు కూర్చుంటే నేరస్థులు ఎవరో జగన్‌కు కనిపిస్తారన్నారు.

ముద్రగడకు వైకాపా నేత డబ్బు ఇచ్చాడా?

5206602552

కాపు గ‌ర్జ‌న‌`తో ఏపీ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. తునిలో విధ్వంసం సృష్టించారు. రైలు, రాస్తారోకోతో జ‌నాలు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ముందు శాంతియుతంగా నిర్వ‌హించాల‌నుకున్న స‌భ‌..ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు అక‌స్మాత్తుగా దారితీయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొన్ని అసాంఘిక శ‌క్తులు క‌లిసి ఈ విధ్వంసానికి పాల్ప‌డ్డాయ‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇది ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌ని, ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ స‌భ‌కు నాయ‌క‌త్వం వ‌హించిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై ఏపీ మంత్రులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. వైకాపా అధినేత ప్రోద్బ‌లంతోనే ముద్ర‌గ‌డ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.
కాపులను ముద్రగడ తప్పుదోవ పట్టిస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై జీవో ఇస్తే కోర్టులో అది నిలబడదని తెలిపారు. దీక్షల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడం ముద్రగడకు అలవాటేనని చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ప్రవేశం లేదంటూ చాంబర్ ముందు ముద్రగడ బోర్డు పెట్టించారని చినరాజప్ప ఆరోపించారు. 15 రోజుల క్రితం వైకాపా నేత కరుణాకర్ రెడ్డి ముద్రగడను కలిసి డబ్బు అప్పగించారని హోంమంత్రి ఆరోపించారు. ముద్రగడ వెనుక వైకాపా నేతలున్నారని మండిపడ్డారు. రైల్‌రోకో, రాస్తారోకో చేయాలని ముద్రగడ పద్మనాభం అప్పటికప్పుడు మాత్రమే పిలుపు ఇచ్చారని… ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లనే ఈ ఘటనలు జ‌రిగాయ‌ని మంత్రి నారాయణ మండిపడ్డారు.

సెక్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ సర్వే

09015860450120

ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన “ఇండియా టుడే” తరచూ సెక్స్ మీద సర్వేలు నిర్వ‌హించ‌డం కామ‌న్‌. ఈ సంస్థ‌ తాజాగా జరిపిన సర్వే ఫలితాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశంలో సెక్స్ సర్వే విషయాల్ని పక్కన పెడితే…. హైదరాబాద్ ఇమేజ్ పై ప్రభావం చూపించేలా ఈ సెక్స్ సర్వే ఫలితాలు ఉండడం గమనార్హం. సెక్స్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ సెక్సియస్ట్ నగరంగా పేరు తెచ్చుకోవటం విశేషం. హైదరాబాద్ చాలా హాట్ అన్నట్లుగా ఈ సర్వే ఫలితాలు ఉండటం సంప్రదాయవాదుల్ని కలిచి వేసే అంశంగా చెప్పొచ్చు. సదరు సర్వేలో తేల్చిన విష‌యాలు ఇలా ఉన్నాయి.
* తెలుగు రాష్ట్రాల రాజధాని ప్రజల్లో ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది పెళ్లి సమయానికే తాము వర్జిన్స్ కాదని తేల్చారు.
* 67 శాతం మంది తాము ఎలాంటి భావోద్వేగం లేని క్యాజువల్ సెక్స్ లో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు.
* సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది కెరీర్ కోసం.. అందులో రాణించటం కోసం సెక్స్ కు సై అనే వారు 34 శాతం మంది.
* శృంగారంలో పార్టనర్ సంతృప్తి ముఖ్యమని భావించిన వారు 41 శాతం.
* తమ వివాహేతర సంబంధాలకు కారణం వైవాహిక జీవితాల్లోని ఘర్షణలేనని తేల్చిన వారు 34 శాతం మంది
* సెక్స్ ను వీడియోగా తీసుకోవాలనుకునే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ.
* దేశ వ్యాప్తంగా పట్టణ ప్రజల్లో 41 శాతం మంది 18 ఏళ్లకు ముందే.. 15 శాతం మంది 15 ఏళ్లకు ముందే సెక్స్ లో పాల్గొంటున్నారు.
* తమ పార్టనర్ వర్జిన్ కాకున్నా ఫర్వాలేదని భావిస్తున్న వాళ్లు 21 శాతం మంది.
* శృంగారం ఇష్టం లేనప్పుడు తలనొప్పి అని తప్పించుకుంటారట.
* పెళ్లికి ముందే శృంగార అనుభవం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోమని 63 శాతం మంది అబ్బాయిలు చెప్పారు (2004లో ఇది 77శాతంగా ఉండేదట)
* పేరు కూడా తెలియని వ్యక్తులతో.. పూర్తిగా అపరిచిత వ్యక్తులతో సెక్స్ పాల్గొన్న వారు 14 శాతం మంది.
* పురుషుల్లో ఆకర్షించేవి బాహువలని 37 శాతం మహిళలు చెబితే.. సిక్స్ ప్యాక్ అని 23 శాతం మంది అమ్మాయిలు చెప్పారు.
* ఇక స్త్రీలలో తమకు నచ్చేది ముఖం.. కళ్లు.. జుట్టు అని 24 మంది మగాళ్లు చెబితే.. వక్షభాగం ఆకట్టుకుంటుందని 22 శాతం మంది అబ్బాయి పేర్కొన్నారు.

తుని ఘటనలో వైకాపా హస్తం

910748450210

తూర్పుగోదావ‌రి జిల్లా తునిలో జ‌రుగుతున్న కాపు గ‌ర్జ‌న‌లో త‌లెత్తిన హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న వెన‌క వైకాపా హస్తం ఉందని ఆయ‌న‌ ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ సున్నితమైన అంశమని, ఆ సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది విధ్వంస చర్యలకు కుట్ర పన్నారని ఆయన అన్నారు. రైళ్లు తగులబెట్టేంత ఆలోచన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఉంటుందా? అని ప్రశ్నించచిన చంద్రబాబు.. కొన్ని రాజ‌కీయ శ‌క్తులు రాజకీయ దురుద్దేశంతో ఈ పరిస్థితి సృష్టించాయ‌ని, స్వార్థం కోసం వారు తెర వెన‌క ఉండి విధ్వంసం సృష్టించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
పులివెందుల‌లో ఇలాంటి రౌడీయిజం, ఇలాంటి హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జరిగితే మామూలే అన్నట్టు ఉండేది. కానీ ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా తునిలో ఈ ఘటన జరగడం ఊహకు అందనిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక నేర‌గాడి కుట్ర వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని చెప్పిన చంద్ర‌బాబు ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేశారు. అసెంబ్లీలోనూ, బయట రౌడీయిజం చేయాలని చూస్తున్నారని, ఇలాంటి పనుల చేయడం వల్ల ఎవరికి నష్టమో కాపులు ఆలోచించుకోవాలని వివరించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టి కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనం పొందాల‌నుకుంటున్నాయ‌ని ఆయన మండిపడ్డారు. ఈ ఘ‌ట‌న వెన‌క ఉన్న రౌడీ శ‌క్తులు హింసాకాండ‌కు పాల్ప‌డితే స‌హించ‌మ‌ని…. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని, దీనిపై కమిషన్ ఏర్పాటు చేసి దీన్ని సమీక్షించాలని కోర్టు ఆదేశించిందని ఆయన చెప్పారు. కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌నుకుంటే తాను ఈ రోజే జీవో ఇస్తాన‌ని…అయితే కోర్టులు కొట్టివేసే జీవోల వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

మ‌హాత్మ గాంధీ చివ‌రి రోజు ఇలా

89560602

అహింసా మార్గంతో దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహనీయుడు మహాత్మాగాంధీ. జనవరి-30 1948లో గాంధీజీ హత్య జ‌రిగింది. స్వాతంత్ర్యం కోసం ఎన్నో కలలు గన్న గాంధీజీ.. స్వాతంత్ర్యం సిద్ధించిన నాలుగు నెలలకే ప్రాణాలు కోల్పోయారు. భౌతికంగా ‘బాపూజీ’ లోకాన్ని వీడినా.. ఆయన త్యాగనిరతి జాతి జనుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయింది. గాంధీజీ చనిపోయేనాటికి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వి.కళ్యాణం చెప్పిన వివరాల ప్రకారం.. ఒకసారి గాంధీజీ జీవితంలో చివరిరోజుని పరిశీలిస్తే ఆనేక విష‌యాలు మ‌న‌కు తెలుస్తాయి.
గాంధీజీ చివ‌రి రోజున ఏం జ‌రిగిందంటే….
– ప్రతిరోజు గాంధీ దినచర్య ప్రార్థనతోనే మొదలయ్యేది. ప్రార్థనను ఉదయానికొక తాళం చెవిగా.. రాత్రి వేళకు ఒక బోల్టుగా అభివర్ణించేవారు గాంధీ. చనిపోయే రోజు కూడా యథావిధిగా ఉదయం 3 :30 నిమిషాలకు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు గాంధీ.
– ఉదయం 6 గంటలకు జవహర్ లాల్ నెహ్రూ మేనల్లుడైన రతన్ కుమార్ నెహ్రూ భార్య రంజన్ గాంధీజీని కలుసుకుని కాసేపు ముచ్చటించారు.
– 9:30 నిమిషాలకు భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యంగ ముసాయిదాను పరిశీలించిన గాంధీ.. అనంతరం భోజనం చేశారు.
– మధ్యాహ్నం సమయంలో లైఫ్ మ్యాగజైన్ ఫొటోగ్రాఫర్ మార్గరెట్ బోర్క్ వైట్ కి గాంధీజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ లో భారత డిప్యూటీ హై కమిషనర్ గా పనిచేస్తున్న ఎన్.ఆర్.మల్కానితో చర్చలు జరిపారు.
– సాయంత్రం సమయంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ మరియు ఆయన కుమార్తె గాంధీని కలిశారు
– సాయంత్రం 4:30 నిమిషాలకు గాంధీజీ భోజనం చేశారు
– సాయంత్రం 5:15 నిమిషాలకు బిర్లా హౌజ్ లోని ప్రార్థన సమావేశానికి గాంధీజీ మేనకోడళ్లు మను, అబాలతో కలిసి బయల్దేరారు.
– సాయంత్రం 5:17 నిమిషాలకు నాథూరాం గాడ్సే.. తన దగ్గర ఉన్న పిస్టల్ తో గాంధీజీపై కాల్పులు జరిపాడు. గుండెలోకి మూడు బుల్లెట్లు చొచ్చుకుపోవడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు గాంధీ. ఊహించని ఈ పరిణామానికి దేశం నివ్వెరపోయింది. జీవితమంతా స్వాతంత్ర్యం కోసం ఆరాటపడ్డ గాంధీ.. స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరం గడవకముందే ఇలా ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కలచివేసింది.

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...