తుని కాపు గర్జన సరికొత్త వివాదాలకు దారితీస్తోంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన వాటి నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద్, వైకాపా అధినేత జగన్ మధ్య వివాదం నడుస్తోందన్న విషయం తెలిసిందే! ఇప్పుడు వీరి మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. కాపు నాయకుడిగా పేరొందిన వంగవీటి రంగాను కోడెల శివప్రసాద్ హత్య చేయించారని జగన్ విమర్శించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
వంగవీటి రంగాను హత్య చేయించిన కోడెల శివప్రసాదరావును స్పీకర్‌ను చేసిన క్రిమినల్ చరిత్ర చంద్రబాబుదని వైకాపా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై కోడెల తీవ్రంగా స్పందించారు. వారానికొసారి కోర్టు బోనులో నిలబడే జగన్ రాజకీయ విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిమినల్ అన్న పదానికి చొక్కా తొడిగితే అది జగనేనని విమర్శించారు. రంగాతో తనకు స్నేహం గానీ, వైరం గానీ లేదని కోడెల చెప్పారు. రంగా హత్య తర్వాత దాడులు, లూటీలు జరిగాయని అందుకు మనస్తాపంతో హోంమంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. జగన్ ప్రోత్సహించిన రౌడీ మూకలే తునిలో విధ్వంసం సృష్టించాయని జనం భావిస్తున్నాయని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నేరాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగనేనని కోడెల ఫైర్ అయ్యారు. జగన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదన్నారు. అద్దం ముందు కూర్చుంటే నేరస్థులు ఎవరో జగన్‌కు కనిపిస్తారన్నారు.
No comments:
Post a Comment