ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే `తూర్పు` ఒక్కసారిగా భగ్గుమంది. ఉద్రిక్తతతలతో అట్టుడికిపోయింది.. రైల్‌రోకో, రాస్తారోకోలతో ఉద్రికత్తమైంది. మరి ఇంతటి హింసాఘటనలకుకారణమైన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఇంతటి విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే ఆయన ఇంత సడన్‌గా కాపు ఉద్యమాన్ని తన భుజస్కందాలపై వేసుకోవడానికి కారణాలు ఏమైనా అయ్యుండచ్చు.. అయితే ఆయన గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు జరిగిన విషయాలను ఆ జిల్లకు చెందిన కాపు నేత, హోంమంత్రి చినరాజప్ప దృష్టిపెట్టారు. ఆయన కాపులకు ఏం చేశారో గుర్తుచేస్తున్నారు.
`ఆయనేదో కాపులను ఉద్ధరించినట్లు. కాపులు బీసీల్లో చేర్చే ప్రక్రియ ఆయన వల్లే జరుగుతుందన్నట్లు. ఇంక ఎవరూ పట్టించుకోనట్లు మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కాపులు తన వద్దకు రావొద్దంటూ ఆయన బోర్డులు పెట్టారు. మేము కాపులకు న్యాయం చేయాలని, బీసీలకు ఇబ్బంది లేకుండా చేయమని సీఎంను కోరాం. సమావేశం పెట్టవద్దని ఎవరూ అనరు. ఆ సభకు ప్రభుత్వం కూడా సహకరించింది. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. వైకాపా గూండాలు అక్కడికి వచ్చారు. రైలు, పోలీ్‌సస్టేషన్లు తగులబెట్టారు. అయినా పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని చెప్పి బెదిరించడం కరెక్ట్ కాదు.’ అంటూ ముద్రగడపై డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు.
గాంధీ మార్గంలో పోరాటం చేస్తామని ప్రకటించి, రైలు ఎందుకు తగులపెట్టారని ప్రశ్నించారు. ఈ సభ వెనక వైకాపా హస్తం ఉందని 15 రోజుల కిందటే చెప్పానని గుర్తుచేశారు. ఇదంతా వైకాపా ముసుగులో చేస్తున్నారని, తిరుపతికి చెందిన కరుణాకర్‌రెడ్డి 10 రోజుల ముందు అక్కడికి వెళ్లి, ఆర్థిక సహాయం చేసి వెనకుండి నడిపించారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏరోజూ కాపుల గురించి ప్రస్తావించలేదని, బొత్స లాంటి నాయకులు పదేళ్లు మంత్రిగా ఉండి కూడా కాపులను పట్టించుకోలేదన్నారు. మరి కాపు నేతపై ఎదరుదాడి చేసేందుకు టీడీపీ కాపు నేతనే రంగంలోకి దించి ముద్రగడ రహస్యాలు బయట పెట్టించింది.
No comments:
Post a Comment