ఎంతో కాలంగా అక్కినేని నాగార్జునకి తీరని కోరిక ఒకటి తీరింది. రీసెంట్ గా నాగార్జున ఓ రికార్డుని క్రియేట్ చేశాడనే విషయం తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరటమే ఆ రికార్డ్ కి కారణం.
అయితే చాలా కాలంగా నాగార్జున సైతం టాలీవుడ్ కి చెందిన 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరాలని చూస్తున్నాడు. మనం మూవీతో ఆ కోరిక తీరుతుందని అనుకున్నాడు. కానీ ఆ ఛాన్స్ కొద్దిగలో మిస్ అయింది. బాక్సాఫీసు వద్ద నాగార్జున స్టామినా ఏమిటన్నది? ఇప్పటి వరకూ అందరికి ఓ మిస్టరీగా ఉండేంది. నాగార్జున మూవీలు బాక్సాపీస్ వద్ద సాధరణ కలెక్షన్స్ కొల్లగొడతాయి తప్పితే..భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ లేదని అంటున్నారు. దీంతో నాగార్జున మూవీలకి సంబంధించిన బడ్జెట్ సైతం లిమిట్ గా ఉండేది. నాగార్జున మూవీల నిర్మాణం అంటే ఓ ఫిక్స్డ్ లైన్ ఏర్పడింది. ఇటువంటి సమయంలో మనం, సోగ్గాడే చిన్ని నాయన వంటి మూవీలు వరుస సక్సెస్ లతో నాగార్జున తిరిగి తన బాక్సాపీస్ స్టామినాని నిరూపించుకున్నాడు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలలో భారీ హైప్ తోనూ, భారీ థియోటర్స్ లో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో మూవీకి ధీటుగా సోగ్గాడే చిన్ని నాయన మూవీ సైతం వారం రోజుల తేడాతా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వటం ఇక్కడ విశేషంగా మారింది. ఇక ఈ విషయంపై స్పంధించిన నాగార్జున నా కోరికని సోగ్గాడే చిన్ని నాయన మూవీ తీర్చిందని చెప్పుకురావటం విశేషం.
No comments:
Post a Comment