ఎన్డీయేలోకి టీఆర్ఎస్‌..ఆ ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు?

kcr-modi-872822

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో విజ‌యోత్సాహంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో చర్చించారని సమాచారం. అయితే ఈ ఇరువురు అరగంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌ల్లో ఏయే అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చయో ఖ‌చ్చితంగా తెలియ‌క‌పోయినా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మాత్రం ర‌క‌ర‌కాల వార్త‌లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
నిజానికి కేంద్రంలోని ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరుతుందని… కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎంపీ కవితకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఖండించిన కవిత… వీలు దొరికినప్పుడల్లా కేంద్రంపై తనదైన స్టయిల్లో విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా మోడీతో కేసీఆర్ మీటింగ్ లో టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరే అంశంపై చర్చలు జరగొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేట‌ర్‌లో మ‌జ్లిస్‌తో సంబంధం లేకుండా టీఆర్ఎస్ బ‌ల్దియా పీఠాన్ని ద‌క్కించుకుంది.
బీజేపీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని భావిస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్తు లేద‌ని..ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కూడా ఇబ్బంది త‌ప్ప‌ద‌ని బీజేపీ నేత‌లు కేంద్రానికి చెపుతున్నారు. ఇక టీ టీడీపీ విలీనానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే లేఖ ఇచ్చినందున ఇక టీఆర్ఎస్‌-బీజేపీ దోస్తీ క‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌న్న వ్యాఖ్య‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీఆర్ఎస్ ఎన్డీయేలోకి చేరితో ఆ పార్టీకి రెండు కేంద్ర మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌వ‌చ్చ‌ని టాక్‌. కేసీఆర్ కుమార్తె క‌విత‌తో పాటు లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్ష నేత, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డికి ఆ రెండు ప‌ద‌వులు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే క‌రీంన‌గ‌ర్ ఎంపీ, పార్టీ సీనియ‌ర్ నేత వినోద్‌కుమార్ పేరు కూడా ప‌రిశీల‌న‌కు రావ‌చ్చ‌ని తెలుస్తోంది.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...