కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాజ్యసభ పదవీ కాలం త్వరలోనే ముగియడంతో ఆయన గవర్నర్‌గా వెళ్లిపోతున్నారని..ఇక ఆయన్ను మంత్రిగా చూడలేమని…ఏపీకి నిధుల విషయంలో ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలకు మోడీ చెక్ పెట్టారు. కర్నాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా ఉంటున్న వెంకయ్య పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. ఆయన ఇప్పటికే మూడు సార్లు ఆ పదవి ఎంపికయ్యారు. అయితే బీజేపీ లో ఒక్కో నాయకుడిగా అత్యధికంగా మూడు సార్లు మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. అసాధారణ పరిస్థితుల్లో తప్ప నాలుగవ సారి ఎవరికీ ఈ అవకాశం దక్కదు.
ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ బలహీనంగా ఉంది. అక్కడ నుంచి ఆయన మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే ఛాన్స్ లేదు. దీంతో వెంకయ్య ఏపీ కోట నుంచి ఎంపిక అవుతారని మరో ప్రచారం జరిగింది. ఏపీకి మూడు రాజ్య సభ సీట్లు వస్తాయి. అందులో ఒకటి వెంకయ్యకు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఒకప్పుడు వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. అటువంటి వ్యక్తి వేరే పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ అవ్వడం మంచిది కాదని బీజేపీలోనే చర్చలు సాగాయని సమాచారం.
ఇక వెంకయ్య లాంటి అనుభవజ్ఞుడును కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని మోడీ ఆయన్ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయినట్టు టాక్. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న చందన్‌మిత్ర పదవీకాలం ఈ ఏడాది జూన్ 29తో ముగియనుంది. ఆయన బీజేపీ సీనియర్ నేత ఎల్ కె. అద్వానీకి బాగా సన్నిహితుడు. ఆయనకు అవకాశం కల్పించకుంటే పార్టీలో నిరసనలు వ్యక్తమయ్యే అవకాలున్నాయి. అయితే ఆయన స్థానాన్ని వెంకయ్యతో భర్తీ చేస్తే పెద్దగా విమర్శలు వచ్చే అవకాశం లేదనే మోడీ, అమిత్ షా భావించి ఈ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వెంకయ్య ఫ్యూచర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా మోడీ స్కెచ్ గీస్తున్నారనే దీనిని బట్టి స్పష్టమవుతోంది.
No comments:
Post a Comment