రూ. 251 ల‌కే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్

8514501210

రూ. 251 ల‌కే స్మార్ట్ ఫోన్ ఒక‌ప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాల‌నుకునేవారు.. రాను రాను ఎవ‌రిచేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ నిత్యావసర వ‌స్తువుగా మారింది. అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు చెప్పుకోబోయే స్మార్ట్ ఫోన్ గురించి మీరు ఎక్కడా విని ఉండరు, చూసి కూడా ఉండరు. దేశంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. దాని ధర జస్ట్ రూ. 251 మాత్రమే. ‘ఫ్రీడమ్ 251’ పేరుతో దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ దేశంలోనే చౌకైన స్మార్ట్ ఫోన్ ను తయారు చేసింది. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా ఈ మొబైల్ ను ఈ నెల 17న విడుదల చేయనున్నారని కంపెనీ తెలిపింది. తొలుత ఈ స్మార్ట్ ఫోన్ ధర 500 రూపాయలు ఉంటుందని అనుకున్నారు.
కానీ అంతకంటే తక్కువగా రూ.251కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్ ఇదే. దీని ఫీచర్స్ ఏంటంటే.. 4 అంగుళాల టచ్ స్క్రీన్ – 1 జీబీ రామ్ – 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ – 3.2 ఎంపీ కెమెరా – 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా – 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటాయి. దీని ప్ర‌త్యేక‌త‌లు చూస్తేనే మైండ్ బ్లోయింగ్ గా ఉంది కదూ. సాధారణంగా 8 జీబీ మెమొరీ కార్డు లేదా 1450 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా రూ. 251 ధరకు రావు. అటువంటిది ఈ ధరలో ఇన్ని సౌకర్యాలతో ఫోన్ రావడం అంటే నిజంగానే వండర్.
ఇదంతా భారత ‘మేకిన్ ఇండియా’ సాధించిన ఘనతే. కాగా, రింగింగ్ బెల్స్ కంపెనీ ఇటీవలే రూ.2,999కే 4జీ స్మార్ట్ ఫోన్ తో పాటు మరో రెండు ఫీచర్ మొబైల్ లను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు వేలకు వేలు పోసి ఫోన్ కొంటే.. దొంగల భారిన పడటం లేదా చెడిపోవడం లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మళ్లీ అంత డబ్బు పోసి కొనలేకపోవ‌డం స‌హ‌జ‌మే. అలాంటివాళ్ల కోసం ఈ స్మార్ట్ ఫోన్ చాలా సౌలభ్యంగా ఉండనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఈ స్మార్ట్ ఫోన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.

1 comment:

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...