తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ జర్నీలో దూసుకుపోతోంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇట్టే ఎగరేసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. కాంగ్రెస్ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు వినిపిస్తోంది. ఒకరిద్దరు ముఖ్య నేతలు వారితో మంతనాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాతో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతల వైఖరి కూడా అనుమానాస్పదంగానే ఉందని తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందే సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూ. 5 భోజనం తిని బాగుందని ప్రభుత్వానికి కితాబివ్వడం. తాజాగా ఎంపీ వి.హనుమంతరావు గ్రేటర్ పదవిని ఓబీసీకి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేయడం వంటివాటిపై కాంగ్రెస్ లో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 21 మంది ఎమ్మె ల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్, కాలే యాదయ్య, విఠల్ రెడ్డి, కోరం కనకయ్యలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా కారు ఎక్కి గులాబీ కండువా కప్పించుకున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ గులాబీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరకు వివిధ కారణాల వల్ల దానం నాగేందర్ మనసు మార్చుకుని కాంగ్రెస్‌లోనే ఉండి పోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎర్రబెల్లి టీడీపీకి షాక్ ఇచ్చినట్లుగా వీరు చివరివరకు అనుమానం రాకుండా ఒక్కసారిగా గోడ దూకినా దూకొచ్చని అంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
-
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని త్రివిక్రమ్ ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ రానుంది. కాన...
No comments:
Post a Comment