దిల్ రాజే దిక్కు అని అంటున్నాడు

480458020

ఈ మధ్య కాలంలో దిల్ రాజు ఓ వైపు సినిమాల డిస్ట్రిబ్యూషన్ పనులను చూస్తూనే, మరోవైపు తన బ్యానర్ లో వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఆ విధంగానే ప్రస్తుతం సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో ‘కృష్ణాష్టమి’ అనే సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి19 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకూ ఈ మూవీ పలుసార్లు రిలీజ్ కి వచ్చి వాయిదాలు పడుకుంటూ వచ్చింది. అందుకు ఫైనాన్షియల్ అనేది కారణం కాకపోయినా…థియోటర్స్ సమస్య..అలాగే టైమింగ్ సమస్య అనేది కారణంగా తెలుస్తుంది.
ఇక రిలీజ్ డేట్ కొద్ది రోజుల ముందు ఉండగానే ఈ మూవీకి 14 వ తేదీన ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ మూవీకి కొంత పబ్లిసిటి ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన చిన్న చిత్రాలు కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ రెండు మూవీలు సైతం సక్సెస్ ని సాదించాయి.
ఆ తరువాత వస్తున్న కృష్ణాష్టమి మూవీ సైతం మంచి విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. అయితే సునీల్ మాత్రం ‘కృష్ణాష్టమి’ మూవీకి భారీ ప్రమోషన్స్ ని కోరుకుంటున్నాడు. ఏలాగైనా ఈ మూవీని ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయాలని అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో సునీల్ మార్కెట్ సైతం నార్మల్ గా ఉంది. ‘కృష్ణాష్టమి’ మూవీ సక్సెస్ సాధిస్తేనే సునీల్ ప్యూచర్ ఫిల్మ్స్ కి మార్కెట్ అనేది ఉంటుంది, లేదంటే తన మార్కెట్ డైలామాలో పడినట్టే అని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...