క్ర్తైస్తవ మతగురువు పోప్ జాన్ పాల్-2కి ఓ వివాహితతో ‘సన్నిహిత సంబంధం’ ఉన్నట్లు ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఒక కథనంలో తెలిపింది. పోలండ్‌లో జన్మించిన అమెరికన్ తత్వవేత్తతో 30 ఏళ్ల పాటు ఆయన ఆ సంబంధాన్ని నెరిపినట్లు పేర్కొంది. పోప్ ఆమెకు రాసిన లేఖలను సోమవారం ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో చూపింది. ఆమె పేరు.. అన్నా తెరీసా తైమియెనియెకా. పోప్ జాన్‌పాల్ కార్డినల్‌గా ఉన్నప్పుడు ఆమెకు రాసిన లేఖల్లో .. ఆమెను తనకు దేవుడి ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు. ఇంకా ఆమె పట్ల ఆయనకున్న ప్రగాఢ భావాలను లేఖల్లో వ్యక్తపరిచారు.
ముఖ్యంగా తత్వశాస్త్రంపై ఆయన రాసిన పుస్తకం గురించి తెలుసు కునేందుకు తొలిసారిగా పోప్-2ను ఆమె కలిసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏర్పడిన మాటలు… లేఖలకు సాగినట్టు తెలిపింది. అయితే, ఈ లేఖల ప్రయాణం సాధారణంగానే ఉన్నప్పటికీ.. బంధం పెరుగుతున్న కొద్దీ వారి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగిందని పేర్కొంది. ఏదేమైనా క్రైస్తవులందరూ పవిత్రమైన వ్యక్తిగా భావించే పోప్‌పై బీబీసీలో ఈ కథనం రావడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
No comments:
Post a Comment