హైద‌రాబాద్‌లో యాఫిల్ ఆఫీస్‌

40804580201

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న ప్ర‌ముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. హైద‌రాబాద్‌లో త‌మ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసే విష‌యాన్ని ఆ సంస్థ కూడా ధృవీక‌రించింది. హైదరాబాద్‌లో కొత్తగా డెవలప్‌మెంట్ ఆఫీసులో సుమారు 150 మంది ఉద్యోగులు ఉంటారని, వీరు మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని యాపిల్ ప్రతినిధులు వెల్ల‌డించారు.
ఈ ఏడాది చివర్లో అమెరికా క్యూపర్టినోలోని కొత్త క్యాంపస్ హెడ్‌క్వార్టర్స్‌కి సిబ్బంది తరలింపు మొదలుపెట్టే సమయంలో ఇక్కడ కార్యాలయం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వివరించారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై తాము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. యాపిల్ దాదాపు 25 మిలియన్ డాలర్లతో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 4,500 మంది ఈ నిర్మాణంలో పాలుపంచుకోవచ్చని అంచనా. ఏదేమైనా యాఫిల్ సంస్థ హైద‌రాబాద్‌లో త‌మ కార్యాయ‌లం ఏర్పాటు చేయాల‌నుకోవ‌డం మ‌న‌కు శుభ‌ప‌రిణామంగా చెప్పుకోవాలి.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...