రెండు తెలుగు రాష్ట్రాల‌కు హైకోర్టు అక్షింత‌లు

0801452012010

అంద‌రికీ అన్నం పెట్టే రైతన్నకు ప‌ట్టెడ‌న్నం పెట్టేవాళ్లు క‌రువ‌య్యారు.. వ‌ర్షాలు ప‌డ‌క‌.. నీరు లేక ఉన్న‌ పంట వైపు దిగాలుగా చూస్తూ.. నిస్స‌హాయ స్థితిలో ఉండిపోతున్నాడు. రుణ భారం అంతకంత‌కూ ఎక్కువ‌వుతుంటే ఎలా తీర్చాలో తెలియ‌లేని దీన స్థితిలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటు ప్ర‌భుత్వాలు సాయం చేశామ‌ని చెబుతున్నా.. రైతుల ప‌రిస్థితి మాత్రం మార‌డం లేదు! ఇరు రాష్ట్రాల్లో జ‌రిగిన ఆత్మ‌హ‌త్య‌ల‌పై క‌లత చెందిన ప‌లువురు దాఖ‌లు చేసిన ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిగింది. ఇందులో రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై కోర్టు అక్షింత‌లు వేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జ‌రిగింది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సెప్టెంబర్‌లో 154 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 30 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకునేందుకు మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. అదే విధంగా ప్రైవేట్‌ అప్పులే రైతులకు భారం అయ్యాయని పిటిషనర్లు తెలపడంతో ప్రైవేట్‌ రుణాలు తీసుకున్న వారిని కోర్టులో హాజరుపర్చాలని న్యాయస్థానం పిటిషనర్లను ఆదేశించింది.
ఇక ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వ న్యాయ‌వాది కూడా త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న అంశాల‌ను వివ‌రించారు. రెండు రాష్ర్టాల్లోనూ ఇంచుమించు ఒకే ర‌క‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని భావించిన హైకోర్టు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. గత రెండు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు తెలియజేయాలని సూచించింది. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై దాఖ‌లైన‌ వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మూడు వారాలకు వాయిదా వేసింది. మ‌రి కోర్టులైనా జోక్యం చేసుకుని రైతుల‌కు న్యాయం జ‌రిగేలా చూడాలి. లేక‌పోతే రైతుల దుస్థితి మ‌రింత వ‌ర్ణ‌నాతీతంగా మార‌నుంది.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...