సాయి ధరమ్ తేజ్ గొడవ పెద్దది చేస్తున్నాడా?

sai-dharam-tej-37456

ఇండస్ట్రీలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హావా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఉన్న మెగాహీరోలలో బాగా ఎనర్జిటిక్ గా కనిపించే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అల్లుఅర్జున్ తరువాత స్క్రీన్ పై జోష్ గా అందరిని అలరించే హీరోగా సాయి ధరమ్ తేజ్ కి మంచి పేరు వచ్చింది. అందుకే తన మూవీలలో ప్రేక్షకులకి నచ్చేది తన యాక్టివ్ నెస్ అని అంటారు. ఇదిలా ఉంటే, నందమూరి కల్యాణ్ రామ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ రానుందనే విషయం తెలిసిందే. దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి ఈ ప్లాన్ చేస్తున్నాడు. ఈ దర్శకుడు వీరిద్దరి హీరోల కోసం ఒక మంచి కథని రెడీ చేశాడంట.  ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో హిట్ కొట్టిన రవికుమార్ చౌదరి, ఆ తరువాత ‘సౌఖ్యం’సినిమాతో మరో హిట్ ని సాధించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హీరోల హావా ఎక్కువుగా కొనసాగటంతో సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ అయితే ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఏర్పడుతుందని ఈ డైరెక్టర్ ప్లాన్ వేశాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇక ఈ సినిమాకి అటు సాయిధరమ్ తేజ్, ఇటు కల్యాణ్ రామ్ లు చేయటానికి తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తెరపైకి వస్తే నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఒకే థియోటర్ లో కూర్చొని సినిమా చూడాల్సి వస్తుందని అంటున్నారు. కానీ ఈ ఇద్దరి ఫ్యాన్స్ కి ఒకరంటే ఒకరికి పడదు. సాయి ధరమ్ తేజ్ ఈ విధంగా చేయటం వల్ల…ఫ్యాన్స్ మధ్య గొడవలు పెద్దది అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...