అన్నం, పప్పు విమానం ఎక్కాయి

80450200

భార‌తీయ సంప్ర‌దాయ వంట‌కాలైన అన్నం, పప్పు విమానం ఎక్కాయి… అదేంటి ఈ రెండు ఆహార ప‌దార్థాలు విమానం ఎక్క‌డ‌మేంటి అనుకోవ‌డం స‌హ‌జ‌మే..అస‌లు విష‌యం తెలుసుకుందాం.. ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు భారతీయ వంటకాలను రుచి చూపించేందుకు సిద్ధ‌మైంది. ఇప్పటికే ముంబై- ఢిల్లీ రూట్ లో ఈ కొత్త మెనూను అందుబాటులోకి తెచ్చారు. భారతీయుల సాధారణ భోజనం అయిన తాలీ, కుల్హద్ మసాలా చాయ్‌లను తొలి సారి విమాన ప్రయాణికులకు అందించనున్నారు. దీంతో అన్నం – పప్పు వడ్డిస్తున్న తొలి విమాన సర్వీసుగా.. ఎయిర్ ఇండియా నిలిచింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ మెనూ పై ఇప్పటికే మంచి స్పందన లభించిందని ఎయిర్ ఇండియా ఎండీ అశ్వని లోహాని తెలిపారు.
ప్రయాణికుల స్పందన.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో మిగతా సర్వీసులకు ఈ మెనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. తాలీలో భాగంగా అన్నం, పప్పు, పెరుగు, ఒక కూర, రోటీ, పనీర్ లేదా చికెన్ లలో ఒకటి మొత్తంగా ఏడు ఫుడ్ ఐటమ్స్ ఎంచుకునే వీలు ఉంది. అయితే.. సాధారణంగా ప్లైట్ లో అందించే భోజనం కంటే.. తాలీని వేడి వేడిగా వడ్డించేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతోందని..క్రూ మెంబర్లు భావిస్తున్నారు. సాధారణంగా బిజినెస్ క్లాస్ లో అందించే భోజన పధార్థాలను ఒకే సారి వేడి చేసే వీలు ఉండగా.. తాలీ లో మాత్రం… అన్ని పదార్థాలను విడి విడిగా వేడిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తానికి.. ఎయిర్ ఇండియాలో భారతీయులు ఎంతగానో ఇష్టపడే అన్నం పప్పు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాయి.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...