రాజమౌళి దెబ్బకి అమీర్ ఖాన్ షాక్

4894501120120

బాహుబలి మూవీతో రాజమౌళి ఎవరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికి తెలిసింది. బాహుబలి పేరుకి తగ్గట్టుగా ఈ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. దీంతో రాజమౌళి పేరు ఓ బ్రాండ్ అయింది. రాజమౌళికి ఆలోచనలు, తన మూవీలు చాలా రిచ్ గా, గ్రాండ్ గానూ ఉంటాయనేది అన్ని చోట్ల నుండి వినపిస్తున్న మాటలు. గత సంవత్సరం రిలీజ్ అయిన బాహుబలి సినిమా టాలీవుడ్ స్థాయిని పెంచింది. ఇక హిందీ లో బాహుబలి మూవీపై పెద్ద చర్ఛలే జరిగాయి. హిందీలో ఈ మూవీ వంద కోట్ల కలెక్షన్స్ సాధించటం అనేది నిజంగా బాలీవుడ్ పెద్ద హీరోలకి మింగుడు పడని విషయం.
అలాంటి వారిలో అమీర్ ఖాన్ ప్రధమంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీపై మొదటి నుండి ఆసక్తి నెలకొంది. అమీర్ నటించిన దంగాల్ డిసెంబరు 23 న విడుదల కానుంది. బాహుబలి-2 రిలీజ్ సైతం డిసెంబర్ 16నే రిలీజ్ అవుతుంది. దంగాల్ మూవీ 23కి వచ్చినప్పటికీ…ఎక్కవు థియోటర్స్ లో బాహుబలి2 హంగామా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దంగాల్ మూవీని పోస్ట్ చేయటం బెటర్ ని అమీర్ భావిస్తున్నాడు. అందుకే రాజమౌళి దెబ్బకి అమీర్ దంగాల్ మూవీ వెనక్కి వెళ్ళిందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌