కృష్ణ‌కు మ‌హేష్ బంప‌ర్ బ‌ర్త్ డే గిఫ్ట్‌

081045015020

ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్ర‌తి యేడాది త‌న తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజునాడు త‌న ఫ్యాన్స్‌తో పాటు త‌న తండ్రికి ఓ మంచి గిఫ్ట్ ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. తన సినిమాల‌కు సంబంధించి టీజ‌ర్‌, ట్రైల‌ర్ లేదా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తూ వ‌స్తున్నారు. ఇది గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే ఈ యేడాది మ‌హేష్ తండ్రికి అంత‌కు మించి బంప‌ర్ బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది.
శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత మ‌హేష్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నాడు. త‌న‌కు గ‌తంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూప‌ర్ హిట్ సినిమాను ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం సినిమాను ముందుగా ఏప్రిల్ 29న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే సినిమా షూటింగ్ లేట్ అవ్వ‌డంతో ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వంను ఈ చిత్ర యూనిట్ మే రెండో అర్థ‌భాగంలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంది.
ఎలాగూ సినిమా వాయిదా ప‌డ‌డంతో మే చివరి వారంలో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే(మే 31) కానుకగా మే చివరి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేసేలా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ బాబు గత సినిమా ‘శ్రీమంతుడు’ కూడా మహేష్ బాబు బర్త్ డే(ఆగష్టు 9)కి రెండు రోజుల ముందుగా ఆగ‌స్టు 7న రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక త‌న తండ్రికి ప్ర‌తి యేటా త‌న సినిమాల ట్రైల‌ర్లు, టీజ‌ర్ల ద్వారా గిఫ్ట్ ఇస్తున్న‌ట్టుగానే త‌న తాజా సినిమా బ్ర‌హ్మోత్స‌వంను త‌న తండ్రి బ‌ర్త్ డే కానుక‌గా రిలీజ్ చేయాల‌ని మ‌హేష్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌