ఫుల్ జోష్ లో చంద్రబాబు

chandrababu-bullet-0277822

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అస్స‌లు తీరిక ఉండ‌డం లేదు. ఇటీవ‌ల ప్ర‌తి రోజు స‌మావేశాలు, ఇత‌రత్రా పనుల‌తో అల‌సిపోతున్నారు. ఓ వైపు ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, పార్టీ ప‌నుల‌తో పాటు తీరిక క్ష‌ణం లేకుండా ఉంటున్నారు. అయితే ఆయ‌న కొద్దిగా గ్యాప్ రావ‌డంతో ఫుల్ రిలాక్స్ అయ్యారు. విజయవాడ ఏరియాలో కాసేపు బుల్లెట్‌పై రయ్‌రయ్ మంటూ చక్కర్లు కొట్టారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆటవిడుపుగా బుల్లెట్‌పై ఇలా దర్శనమిచ్చారు బాబు.
ఒక అభిమాని బుల్లెట్‌ మోటార్ సైకిల్‌పై పులి బొమ్మ పెట్టి తెచ్చి చూపించారు. దానిపై చంద్రబాబు ఎక్కి నడిపారు. అలాగే కొంద‌రు అభివృద్ధికి అడ్డుప‌డాల‌ని చూస్తున్నార‌ని అలా చేయాల‌ని చూస్తే తాను బుల్లెట్‌లా దూసుకుపోతాన‌ని చెప్పారు. అలాగే రెండో విడ‌త రుణ‌మాఫీ నిధులు వ‌డ్డీతో స‌హా ఇస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఏదేమైనా చంద్ర‌బాబు బుల్లెట్ న‌డ‌ప‌డంతో పాటు ఆయ‌న ఫుల్ జోష్‌లో ఉన్న‌ట్టు క‌నిపించింది.
ఎన్నికల సందర్భంగా కనిపించే ఇలాంటి ఫీట్స్, ఇప్పుడు కనిపించడం ఏంటంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. సీఎం హ్యాపీనెస్‌కు కారణాలు చాలానే వున్నాయని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు, ఏపీకి ఐటీఐఆర్ కేటాయిస్తామని కేంద్రమంత్రులు హామీ ఇవ్వడంతోనే ఇలా రిలాక్స్ అయ్యారని చెబుతున్నారు. మొత్తానికి చాన్నాళ్లు చంద్రబాబు ఇలా కనిపించడంతో పార్టీ అభిమానులు ఫుల్‌ఖుషీ.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌