నాగార్జున పై చిరంజీవి వార్?

tt785451212012

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున పై వార్ ని ప్రకటించుకున్నాడంటూ…వార్తలు వస్తున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బాక్సీపీస్ ని షేక్ చేశాయి కానీ, ప్రస్తుత బాక్సాపీస్ లెక్కలతో పోల్చుకుంటే చిరంజీవికి అంతగా రికార్డ్ లేదని అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలలో నెంబర్ వన్ లో ఉన్నది నాగార్జున అని తెలుస్తుంది. గత కొన్ని చిత్రాలుగా నాగార్జున నటిస్తున్న చిత్రాలు వరుస విజయాలతో బాక్సాపీస్ ని దుమ్మురేపుతున్నాడు. నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీ 50 కోట్ల రూపాయల క్లబ్ లో జాయిన్ అవ్వటంతో బాలయ్య, విక్టరి వెంకటేష్ కి సాధ్యం కానీ ఫిట్ ని సుసాధ్యం చేశాడు. ఇక పెద్ద హీరోలలో మెగాస్టార్ గా పేరుతెచ్చుకున్న చిరంజీవి ప్రస్తుతం తను తీసే 150 చిత్రంతో కనీసం 100కోట్లకి మించి కలెక్షన్స్ ని సాధించాలి.
అలా కాకుంటే కనీసం 50 కోట్లు సాధించే సినిమాగా ఉండాలని లెక్కలు వేస్తున్నారు. ఇక చిరంజీవి మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చే సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంది. ఈ నెల 25 న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి తరువాత ఈ మూవీకి ముహుర్తం జరగనుంది. నాగార్జున తాజాగా సాధించిన 50 కోట్ల రూపాయల క్లబ్ అనేది, చిరంజీవికి ఎదురుగా ఉన్న మొదటి టార్గెట్ అని అంటున్నారు. 100 కోట్ల కలెక్షన్స్ మాట పక్కన పెడితే కనీసం 50 కోట్ల రూపాయలు కూడ బిజినెస్ చేయలేకపోతే చిరీంజీవికి ఆ పరిస్థితులే వేరుగా ఉంటాయని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌