హైదరాబాద్ పై పవన్ అలా అన్నాడా?

789045012010

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీని స్థాపించిన తరువాత రాజకీయాల్లో తను సంచలనంగా మారాడు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ మాటలకి ఎంతో ప్రత్యేకత ఏర్పడుతుంది. ముఖ్యంగా మీడియా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడతాడు అంటూ కాచుకొని కూర్చుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని ఎవ్వరూ టచ్ చేయకపోవటమే మంచిదని అంటున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ ని ఏ విధంగా నిర్వహించాలో ఆలోచిస్తు బిజిగా ఉన్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉండటంతో…ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు తప్పనిసరి అవుతున్నాయి. ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ ని ఆంధ్ర ప్రదేశ్ కాపిటల్ అమరావతి లో జరపాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే కొంత మంది ఈ ఫంక్షన్ ని హైదరాబాద్ లో తక్కువ క్రౌడ్ తో చేస్తేనే బెటర్ అని అన్నారంట. అయితే పవన్ మాత్రం కచ్చితంగా అభిమానుల సమక్షంలో కొత్త రాజధానిలో చేద్ధాం అంటే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ ప్రస్తుతం ఈ సినిమాకి అంతగా సెట్ కాదు అనే విధంగా పవన్ చెప్పుకొచ్చాడంట. ఈ మధ్య కాలంలో ప్రముఖ ఆడియో ఫంక్షన్స్ అన్నీ కొత్త రాజధాని వైపు తరలివెళుతున్నాయి. అందులో ఒకటిగా పవన్ కళ్యాణ్ మూవీ కూడ ఇప్పుడు చేరింది. ఒక లక్ష మంది కి సరిపడా ప్లేస్ కోసం అమరావతి లో ఈ చిత్ర యూనిట్ వేధికని చూస్తుంది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌