లేటు వయస్సులో మ్యారేజ్‌

tt7848050201

ఎట్టకేలకు నిన్న‌టి త‌రం హీరోయిన్ సంఘ‌వి ఓ ఇంటిది అయ్యింది. 1993లో ‘అమరావతి’ అనే తమిళ సినిమా ద్వారా గ్లామర్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టింది. దశాబ్దంపాటు తన నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించింది కూడా! సంఘవి వయసు 39 ఏళ్లు. అజిత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సింధూరం, తాజమహల్, సీతారామరాజు, ఆహ, సూర్య వంశం, సమరసింహారెడ్డి, ర‌జనీకాంత్ బాబా ఇలా దాదాపు 100 సినిమాల్లో నటించిన ఆమె, ఐటీ కంపెనీ ఓనర్ వెంక‌టేష్‌ను మ్యారేజ్‌ చేసుకుంది.
బుధ‌వారం ఉద‌యం బెంగళూరులోని హోట‌ల్ వివంత తాజ్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జ‌రిగింది. సంఘ‌వి క‌న్న‌డ అమ్మాయి కాగా, వెంక‌టేష్ మ‌ళ‌యాళి. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. తండ్రి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరి వివాహానికి నటి మీనాతోపాటు కొందమంది నటీనటులు హాజరయ్యారు. హనీమూన్‌కి ఈ కంపుల్ ఫారెన్‌కి ప్లాన్ చేసినట్టు టాక్. త‌న పెళ్లి విషయాన్ని కన్ఫామ్ చేస్తూ స్వయంగా సంఘవి మీడియాకు కొన్ని ఫోటోలను కూడా పంపింది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌