ఆతడితో సెక్స్ చేయకపోతే అరెస్ట్ చేస్తాడట !

08420251021001

ఓ సెక్స్ వ‌ర్క‌ర్ వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డినందుకు ఓ పోలీస్ అధికారి ఆమెను త‌ప్పించేందుకు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. అదేంటో తెలుసా త‌న కోరిక తీరిస్తే ఆమెను ఆ కేసు నుంచి త‌ప్పిస్తాన‌ని చెప్పాడు. క‌డుపు నింపుకునేందుకు ఆ బాధిత మ‌హిళ ఒళ్లు అమ్ముకుంటే.. అతను విధుల్లో ఉంటూ పోలీస్ యూనిఫామ్ ను తాకట్టుపెట్టాడు. ఇంగ్లండ్ లో జరిగిన ఈ ఘటనలో డేవిడ్ గిబ్సన్ (44) అనే పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. లివర్ పూల్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. పోలీసు యూనిఫామ్ లో ఉంటూ తన పట్ల దారుణంగా వ్యవహరించిన తీరును బాధితురాలు వెల్లడించింది.
వెస్ట్ డెర్బీలోని ఈటన్ రోడ్డు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్ గిబ్సన్ ఓ రోజు నైట్ డ్యూటీలో ఉన్నాడు. స్టేషన్ లో ఎవరికీ చెప్పకుండా టూబ్రూక్ లో షీల్ రోడ్ ఏరియాలో తన వాహనాన్ని పార్క్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ ప్రాంతానికి సెక్స్ వర్కర్లు వస్తుంటారు. ఆ సమయంలో బాధిత మహిళ గిబ్సన్ కంటపడింది. జరిమానా కట్టాలని పోలీస్ అధికారి ఆదేశించగా, తన వద్ద డబ్బులు లేవని బాధిత మహిళ చెప్పింది. తనను వదిలిస్తే ఈ వీధుల్లోకి రానని ఆమె చెప్పింది.
అయితే పోలీస్ అధికారి గిబ్స‌న్‌ తాను మంచివాడినని, అరెస్ట్ చేయనని, జరిమానా వేయనని, తన కోసం ఏం చేస్తావని అడిగాడు. గిబ్సన్ ఓ పోలీస్ అధికారిగా తన హోదాను దుర్వినియోగం చేశాడు. తన వాహనంలో ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చుకున్నాడు. అయితే ఆమె త‌న‌ను గిబ్స‌న్ దారుణంగా వేధించాడ‌ని కోర్టును ఆశ్ర‌యించ‌డంతో గిబ్స‌న్‌పై కోర్టు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌