మెగాస్టార్ చిన్న అల్లుడు ఇత‌డే (ఫొటో)

84045012012

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా శ్రీజ పెళ్లి గురించి ఎన్నో పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరు స్వ‌యంగా పెళ్లి పనుల్లో పాల్గొన్న ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఇక శ్రీజ చేసుకోబోయే కుర్రాడు చిత్తూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిషన్ కొడుకు కళ్యాణ్. ఆమె శ్రీజ‌కు క్లాస్‌మేట్ కూడా కావ‌డం విశేషం. గ‌తంలో శ్రీజ శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లాడ‌డం త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో విడిపోయిన సంగ‌తి తెలిసిందే.
ఇక శ్రీజ‌కు కాబోయే భ‌ర్త‌, మెగాస్టార్ కు కాబోయే అల్లుడు ఎలా ఉన్నాడో ఆత్రుత అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా..మెగా అల్లుడు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై మెగా ఫ్యామిలీ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం. ఇక చ‌దువుకునే రోజుల నుంచి శ్రీజ‌, క‌ళ్యాణ్ మంచి ఫ్రెండ్స్‌, ఈ నెల 1న హైదరాబాద్‌ లోని ఓ హోటల్‌లో వారి నిశ్చితార్దం జరిగింది. శ్రీజ పెళ్లి కంప్లీట్ చేశాకే మెగాస్టార్ త‌న 150వ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నారు. శ్రీజ‌కు కాబోయే భ‌ర్త‌, చిరు అల్లుడు ఫొటోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌