పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ క‌న్‌ఫార్మ్‌

48580450120

ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి వస్తోందా ? రాజకీయ నాయకుల ఫక్కీలో నమస్కారం పెడుతున్న త్రిష బొమ్మలు గోడల మీద కనిపించడంతో తమిళనాట ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. విషయమేమిటని ఆరా తీస్తే, ఆ పోస్టర్లు, గోడ మీద రాతలన్నీ త్రిష కొత్త సినిమాలోని పాత్రకు సంబంధించినవట! ధనుష్ సరసన తొలిసారిగా త్రిష నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పేరు – ‘కొడి’. అంటే తమిళంలో ‘జెండా’ అని అర్థం.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రానున్న మూవీ ‘కోడి’. దురై సెంథిల్‌కుమార్ డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ధనుష్. తొలిసారి డబుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇందులో త్రిష పేరు రుద్ర అనీ, ఎన్నికల్లో పోరాడే రాజకీయ నాయకురాలిగా ఆమె కనిపిస్తారని కోడంబాకమ్ సమాచారం. మొత్తానికి ట్రెండ్‌కు తగ్గట్టుగా కనిపించేందుకు ప్లాన్ చేస్తోంది ఈ అమ్మడు.

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features

Top 5 Free Screen Recording Softwares For Windows

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away