ఆ ఇద్దరి కంటే నాగార్జున నెం.1 అయ్యాడు

589451020

సీనియర్ హీరోలు అని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలని అంటారు. అయితే వీరిలో చిరంజీవి రాజకీయాల్లోకి చేరి సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి తిరిగి సినిమాల్లోకి వచ్చినా గతంలో ఉన్న హైప్ ఇప్పుడు ఉండకపోవచ్చని అంటున్నారు. మార్కెట్ లో వచ్చిన మార్పుల కారణంగా, చిరంజీవి మళ్ళీ సెట్ అవ్వటానికి రెండు, మూడు సినిమాల వరకూ సమయం పడుతుందని అంటున్నారు. ఇక ఈ సీనియర్ హీరోలలో మిగిలింది ముగ్గురు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు వరుస సినిమాలను రిలీజ్ చేసుకుంటూ యాక్టివ్ లో ఉన్నారు. ఇప్పుడు బాక్సాపీస్ వద్ద వరుసగా సాధిస్తున్న మూవీల కలెక్షన్స్ ని చూసుకుంటే నాగార్జున ముందు వరులో ఉన్నాడు. మనం సినిమాకి నలభై కోట్ల షేర్‌ ని కొల్లగొట్టాడు నాగార్జున. తరువాత వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ యాభై కోట్ల షేర్‌ ని రాబట్టింది. ఇక వెంకటేష్, బాలకృష్ణ చిత్రాలు బాక్సాపీస్ వద్ద నార్మల్ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాయి. దీంతో నాగార్జున మిగిలిన ఇద్దరి హీరోల కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. అందుకే వెంకటేష్, బాలకృష్ణ కంటే నాగార్జున నెంబర్ వన్ పొజిషన్ ని కైవసం చేసుకున్నాడని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌