మాట వినని సీనియర్ హీరోయిన్

96560650120

దశాబ్ధంకి పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గానూ, సీనియర్ హీరోయిన్ గానూ అనుభవం ఉన్న హీరోయిన్ నయనతార. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఈ సమయంలో చాలా మంది డైరెక్టర్స్ నయనతార బ్యాచ్ హీరోయిన్స్ ని పక్కన పెట్టేశారు. ఇందుకు కారణం కొత్త హీరోయిన్స్ అందాల ముందు సీనియర్ హీరోయిన్స్ అందాలు చిన్నబోయాయి కాబట్టి. అయితే ఇటువంటి సమయంలో ఇంకా ఈ సీనియర్ హీరోయిన్సే కావాలని వస్తున్న డైరెక్టర్స్ పై రివేంజ్ లు తీర్చుకుంటున్నారు. సెట్స్ పై ఈ సినియర్ హీరోయిన్స్ డామినేషన్ అనేది ఎక్కువుగానే ఉందని అంటున్నారు. ఇప్పుడు వెంకటేష్‌ సరసన నయనతార ఓ మూవీలో నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో పలు హిట్లు ఉన్నాయి.
తమిళంలో బిజీగా ఉన్న నయనతారని ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ మారుతి, వెంకటేష్ కాంబినేషన్ కి సెట్ చేశాడు. దీంతో వెంకటేష్, నయనతార హీరోహీరోయిన్స్ గా బాబు బంగారం సినిమా సెట్స్ పై ఉంది. తమిళంలో బిజీగా ఉండటంతో, బాబు బంగారం షూటింగ్ కి సరిపడ టైం ఇవ్వటం లేదంట. దీనివల్ల డైరెక్టర్ మారుతి బాగా ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. దీంతో ఈ మూవీ అనుకున్న టైం కి షూటింగ్ పూర్తి కాకపోవటంతో…ఈ ఎఫెక్ట్ రిలీజ్ టైంపై పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌