సాయికుమార్ కి ఆస్కార్ అవార్డు..!

54050101

డైలాగ్ కింగ్ అంటేనే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చే పేరు సాయికుమార్‌. విన‌డానికి చాలా ఆశ్చ‌ర్యంగా ఉన్న మ‌న డైలాగ్ కింగ్ ఇప్పుడు ఆస్కార్ అవార్డు రేసులో ఉన్నాడ‌ట‌. ‘రంగీ తరంగ’ అనే కన్నడ చిత్రంలో న‌టించిన సాయికుమార్‌కు ఆస్కార్ అవార్డు వ‌రించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. సాయికుమార్ ఈ సినిమాలో న‌ట‌న‌కుగాను అవార్డుల‌ పోటీ దారుల్లో ఒకరిగా నిలిచారు. ఈ మూవీ ప‌లు కేటగిరిల్లో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అనేక మంది హాలీవుడ్ స్టార్లతో పాటు ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడటం ఆనందాన్ని ఇస్తోందని చెప్పాడు. తనకే గనుక ఈ అవార్డును ఇస్తే.. ఇటీవలే పుట్టిన తన మనవరాలికి అంకితమిస్తానని చెప్పడం విశేషం.
ఈ సినిమా అవార్డుల పోటీలో విజయం సాధిస్తే.. నటుడిగా సాయికుమార్ ను ఆస్కార్ జ్యూరీ ఉత్తమ న‌టుడిగా ఎంపిక చేస్తే.. సాయికుమార్ ఆస్కార్ అందుకున్న తెలుగువాడిగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. అయితే పోటీ మాత్రం ఇంకా చాలానే ఉంది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం పోటీలో ఉన్న 305 సినిమాల్లో ఒకటి ‘రంగీ తరంగ’ . విడుదలై 25 రోజులే అయిన ఈ సినిమా అనూహ్యంగా అకాడమీ అవార్డుల పోటీ జాబితాలో స్థానం సంపాదించుకుంది. అవార్డు ప‌ట్ల సాయికుమార్ మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.. సో.. ఆల్ ద బెస్ట్..

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...