కారం తింటే ఎక్కువ కాలం బతుకుతామా?

pepper-red-chilli-powder

సాధార‌ణంగా డాక్ట‌ర్లు ఉప్పూ కారం తగ్గించుకుని తినండి అంటుంటారు. అవి తినలేక ఏమిటీ చప్పిడి బతుకు అనుకునే వారు ఎందరో.. అయితే కొన్ని అధ్యయనాలు వేరే విధంగా చెబుతున్నాయి. చప్పిడి తిండి తినే వారి కంటే కారం తినే వారే కాస్త ఎక్కువ రోజులు బతికేస్తున్నారట. రుచికి రుచి.. లైఫ్‌కు లైఫ్. అదెలాగో చూద్దాం..! చైనాలో 30 నుంచి 79 ఏళ్ళ వయస్సున్న అరమిలియన్ మందిపై బీఎంజే జ‌ర్న‌ల్ వారు పరిశోధన చేశారట. 2004 నుంచి 2008 మధ్యలో ఉన్న వారిపై ఈ అధ్యయనం చేస్తే 4.90 లక్షల మందిని పరిశీలిస్తే 20, 000 మాత్రమే మరణించారట. కారం, మిరియాలు వంటివి ఎక్కవగా తిన్న వారిలో మరణాల సంఖ్య తక్కువగా ఉందట. ఏం కారం తినేవారు చచ్చిపోరా… అంటే అలా కాదు. అలాగని రోజూ గొడ్డు కారం తినమని ఎక్కడా చెప్పలేదు. తగిన మోతాదులు సాధారణంగా తీసుకునే కారం గురించే ప‌రిశోధ‌కులు త‌మ రీసెర్చ్ పేప‌ర్స్‌లో ప్రస్తావించారు. మరణాల సంఖ్య కారం తినని వారితో పోల్చితే కారం తినే వారిలోనేతక్కువగా ఉందని స్టడీలో తేలింద‌ట‌!
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌