ఆన్ లైన్ షాపింగ్ సైట్ నే బురిడి కొట్టించిన మాయగాడు

online-sbi-02110

కంప్యూటర్ లోనే షాపింగ్ ప్రపంచానికి చీప్ గా కళ్ల ముందుంచే ఆన్ లైన్ సైట్ల విషయంలో ఎంతో మంది మోసపోయారనే విషయాన్ని మనం రోజూ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఆ మాటకొస్తే… సరైన షాపింగ్ సైట్ ను ఎంచుకోకపోతే… అలాంటి అనుభవం మనకు కూడా ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు. కస్టమర్లను మోసం చేయడంలో ముందుంటాయని చెప్పుకునే ఆన్ లైన్ సైట్ ను మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. నగరంలోని వనస్థలిపురంలో నివాసం ఉండే రఘువీరారెడ్డి అనే పాతికేళ్ల యువకుడు… తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సైట్ కు దాదాపు 30 లక్షలకు పైగా టోకరా వేశాడని పోలీసులు వెల్లడించారు. వెబ్ సైట్ ద్వారా అనేక వస్తువులను ఆర్డర్ చేయడంతో పాటు వాటిని డబ్బులిచ్చి మరీ డెలివరీ తీసుకునే ఈ యువకుడు… ఆ తరువాత కొద్దిరోజులకే అవి పాడైపోయాయనో లేక డూప్లికేట్ వస్తువులనో ఫిర్యాదు చేసేవాడట. అలా వస్తువులను వాపస్ ఇచ్చి తన డబ్బులను తిరిగి పొందేవాడట. అయితే… డెలివరీ ద్వారా వచ్చిన వస్తువుల స్థానంలో కంపెనీలకు నకిలీ వస్తువులను అంటగట్టడం ఈ ఘరానా మోసగాడి ప్రత్యేకత. పదే పదే ఇలాగే జరుగుతుండటంతో కంపెనీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు… ఈ మోసగాడి మాయలను బయటపెట్టడంతో కంపెనీ ప్రతినిధులు అవాక్కైపోయారు. ఏదేమైనా… ఆన్ లైన్ షాపింగ్ సైట్లకే కుచ్చుటోపీ వేసిన ఈ కుర్రాడు మహాజాదుగాడని వేరే చెప్పాల్సిన పనిలేదేమో.
please share it..

Comments

Popular posts from this blog

Underground DLC: Procedurally generated levels come to The Division

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Former US Secret Service agent may have stolen bitcoins