కాపు గర్జనకు మేము స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నాం. కాపులకు మా సపోర్ట్ ఉంటుంది.` ఇదీ గత నాలుగు రోజులుగా వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి వైకాపా అధినేత జగన్ ఊదరగొడుతున్నారు. `మా ఉద్యమానికి వైకాపా మద్దతు లేదు. జగన్‌తో మేమెప్పుడూ ఈ విషయంపై మాట్లాడలేదు` ఇదీ కాపు గర్జన నిర్వహించిన ముద్రగడ పద్మనాభం చెబుతున్న మాట. ఇందులో ఎవరి మాటలు నిజం? ఇద్దరికీ నిజమేనా? లేక ఇద్దరివీ అబద్దాలేనా? లేక ఇద్దరూ కలిసి ఆడుతున్న హైడ్రామానా? అనేది అర్థం కాక ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.
వైఎస్సార్సీపీ తమ కాపుల ఉద్యమానికి మద్దతివ్వలేదని, జగన్‌తో నేనెప్పుడూ కాపుల రిజర్వేషన్ ఉద్యమంపై మాట్లాడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ పద్మనాభం. ఇలా ప్రకటించి వైఎస్ జగన్‌కి షాక్ ఇచ్చారు. కాపు ఐక్య గర్జన పేరుతో ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు రిజర్వేషన్ ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం విదితమే. కాపు గర్జన, తదనంతరం చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలోనూ ముద్రగడకు పూర్తిస్థాయిలో మద్దతు పలికారు వైఎస్ జగన్. ఇంతలా వైఎస్ జగన్, ముద్రగడ పద్మనాభంకి మద్దతు పలికితే, ముద్రగడ మాత్రం జగన్‌తో తనకు సంబంధం లేదని తేల్చేశారు.
టీడీపీలో కింది స్థాయి నేతలు తనకు మద్దతుగా నిలిచారనీ, కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీరారెడ్డి మద్దతిచ్చారని ముద్రగడ వ్యాఖ్యానించారు. టీడీపీని ఒకపక్క విమర్శిస్తూనే.. టీడీపీలో కిందిస్థాయి నాయకులు ఉద్యమానికి సపోర్ట్ చేశారని చెప్పడం.. తరువాత ఉద్యమం ప్రారంభంనుంచి చివరి వరకూ నిలిచిన వైకాపాను ఇలా ఇరుకున పెట్టడం..మరోపక్క వైకాపా మద్దతిచ్చానని చెప్పడం చూస్తుంటే డ్రామాను బాగానే రక్తి కట్టిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
No comments:
Post a Comment