శృంగారం జీవితంలో ఓ భాగమే కాని వాటికి కొన్న హద్దులుంటాయనే సంగతి మర్చిపోకూడదు. సహజంగా ఓరల్‌సెక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఆ విధంగా చేస్తే తల, మెడ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదాలు ఏడు రెట్లు ఎక్కువని తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నది. మానవుల్లో మా వైరస్ ఓరల్ సెక్స్ వల్ల వ్యాపించి అటువంటి క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మెడిసిన్ కాలేజీ రీసెర్స్ స్కాలర్స్ తాజాగా చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
ఈ కాలేజ్ స్కాలర్స్ రెండు అధ్యయనాలలో 97 వేల మందిని నాలుగేళ్ల పాటు పరిశీలించిన అనంతరం వారిలో 137 మందికి ఇటువంటి వాటి వల్లే క్యాన్సర్లు సోకిన్నట్లు నిర్ధారించారు. ఈ క్యాన్సర్ లను మౌత్ వాష్ ద్వరా పసిగట్టవచ్చని, ఈ వైరస్ ను వాక్సిన్ తో నివారించవచ్చని చెబుతున్నారు. చాలా కాలంగా తల, మెడ క్యాన్సర్ లు స్మోకింగ్, డ్రింకింగ్ వల్లే వస్తాయని అనుకొంటున్న వారు ఈ వార్తతో పెద్ద షాక్‌కు గురయ్యారు.
ఓరల్ సెక్స్ వల్ల క్యాన్సర్ల సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో డాక్టర్లు వేరే కారణాలు ఉండవచ్చని అనుకున్నారు. నటుడు మైఖేల్ డగ్లస్ తనకు ఓరల్ సెక్స్ వల్లే క్యాన్సర్ వచ్చిన్నట్లు భావిస్తున్నట్లు చెప్పడంతో ఈ వాదనకు విశేష ప్రచారం లభించింది. తలకు, మెడకు వచ్చే క్యాన్సర్ లలో 70 శాతం వరకు ఈ వైరస్ వల్లే వస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ లలో అత్యధికంగా ఉంటున్న గర్భాశయ క్యాన్సర్ ను 2020 నాటికి ఈ వైరస్ ద్వారా వచ్చే క్యాన్సర్ మించి పోతుందని భావిస్తున్నారు.
No comments:
Post a Comment