దేశ రాజధానిలోను, రాజధాని పరిసర ప్రాంతాల్లోను మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. సాధారణ మహిళల సంగతి అలా ఉంటే ఓ మహిళా జర్నలిస్టునే ఏకంగా ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యక్తి వార్నింగ్‌తో ఎలెర్ట్ అయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడుపై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జేఎన్‌యూ వ్యవహరంలో ఢిల్లీ పటియాల కోర్టులో మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది.
ఈ దాడిని ఖండిస్తూ ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమెను ఉద్దేశించి అమరేంద్రకుమార్ అనే వ్యక్తి ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. ఒకట్రెండు రోజుల్లో నీపై గ్యాంగ్ రేప్ జరుగుతుందని. భారత మాతతో చెలగాటమాడకు అంటూ అతడు ట్వీట్ చేశాడు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించడంతో.. అతనిపై ఐపీసీ సెక్షన్లు 354 (ఏ) 1, 509, 506 సెక్షన్ల కింద కింద పోలీసులు కేసు నమోదుచేశారు.
No comments:
Post a Comment