టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి -2 తరువాత దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో తీయబోయే సినిమా ‘గరుడ’ అని టాలీవుడ్‌లకో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ టైటిల్‌ను తమిళంలో రిజిస్టర్ చేసేశారు. దీంతో గరుడ టైటిల్‌పై రాజమౌళి ఆశలు వదులు కోవలిసిందేనని సమాచారం. బాహుబలి-2 మొదలవకముందే.. రాజమౌళి నెక్స్ట్ మూవీపై విపరీతమైన చర్చ జరిగింది.
గరుడ అనే టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాలో ఇండియాలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు నటిస్తారని.. దీని ట్రైలర్ కోసమే పాతిక కోట్లు ఖర్చు చేస్తాడని ఆసక్తికర వార్తలు బయటికి వచ్చాయి. ఐతే నిజంగా రాజమౌళి ఆలోచనలు ఎలా ఉన్నాయో.. ఈ వార్తలు నిజానిజాలెంతో కానీ.. ఈ టైటిల్ అయితే రాజమౌళి సినిమాకు పెట్టుకునే అవకాశమైతే లేదని తేలిపోయింది.
‘గరుడ’ అనే టైటిల్ ను తమిళ స్టార్ హీరో విక్రమ్ వాడేస్తున్నాడు. తిరు అనే దర్శకుడితో విక్రమ్ చేయబోయే సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ పెట్టేశారు. ఈ టైటిల్ ను ఆ సినిమా నిర్మాత రిజిస్టర్ చేసేశాడు కూడా. మరి రాజమౌళి కూడా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడా.. చేయిస్తే మరే భాషలోనూ వాడకుండా షరతులేమైనా ఉన్నాయా అన్నది తెలియట్లేదు. రాజమౌళి సినిమా అంటే ఇక ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. తమిళంలోనూ భారీ స్థాయిలోనే విడుదలవుతుంది. కాబట్టి జక్కన్న ‘గరుడ’ టైటిల్ మీద ఆశలు వదులుకోక తప్పదు. లేదంటే విక్రమ్ ను కన్విన్స్ చేసి ఆ టైటిల్ తను తీసుకోవాలి మరి. అయితే తెలుగులో కూడా ‘గరుడ’ టైటిల్‌ను మోహన్‌బాబు తనయుడు రిజిస్టర్ చేయించాడు. దీంతో ఎలా చూసినా ‘గరుడ’ టైటిల్ సొంతం చేసుకోవాలంటే రాజమౌళి వీరిద్దరిని రిక్వెస్ట్ చేయాల్సిందే.
please share it..
No comments:
Post a Comment