యూత్ లో మంచి ఎనర్జిటిక్ హీరో గా గుర్తింపు పొందిన హీరో రాం. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రాం సినిమా అంటే ప్రేక్షకుల్లో ఇంకా అంచనాలు పెరుగుతాయి, ఎప్పుడూ హీరో సెంట్రిక్ టైటిల్స్ తొ మన ముందుకు వచ్చే రాం ,ఈ సారి “నేను..శైలజ ” అనే సాఫ్ట్ టైటిల్ తో మన ముందుకు వచ్చాడు. పేరు కు తగ్గట్టే ఇది క్యూట్ లవ్ స్టోరీ. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో చేసిన లవ్ స్టోరీ. ఇది ఇదివరకటి రాం సినిమాలకు భిన్నంగా సాఫ్ట్ గా వెళ్తూ ఉంటుంది. మొత్తం మీద కిషోర్ తుమ్మల దర్శకత్వం లో విభిన్నమైన కథ తో రాం హిట్ కొట్టాడు అనే చెప్పాలి
కథాంశం :
హరి ( రాం ) చిన్నప్పటి నుండి కనపడిన ప్రతి అమ్మాయి కి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు . వారు రిజెక్ట్ చేస్తూ ఊంటారు . దీనితో విసుగు పుట్టిన హరి ఇక ప్రేమించకూడదు అని నిర్ణయించుకుంటాడు. అదే సమయం లో శైలజ ( కీర్తి సురేష్ ) పరిచయం అవుతుంది. అమ్మాయి తో స్నేహం మొదలవుతుంది . అందరికీ పరిచయం అవ్వగానే ప్రపోజ్ చేసే హరి ఈ అమ్మాయి కి మాత్రం ప్రపోజ్ చెయ్యకుండానే ప్రేమిస్తుంటాడుఅమ్మాయి కూడా రాం తో స్నేహం గా ఉంటుంది. చివరకు ఒక రోజు ధైర్యం చేసి శైలజ కు ప్రపోజ్ చేస్తాడు. కానీ శైలజ వెంటనే రిజెక్ట్ చేస్తుంది. ఇంతలో హరి కి తన చెల్లెలు శైలజ అన్నయ్య (ప్రిన్స్) తో ప్రేమ లో ఉన్నట్లు తెలుస్తుంది, వారి ద్వారా శైలజ కు తన ఇష్టా ఇష్టాలను వ్యక్తం చెసే స్వతంత్రం వాళ్ల నాన్న శ్రీనివాసరావు ( సత్య రాజ్ ) దగ్గర లేదు అని తెలుస్తుంది, శైలజ కు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ? హరి ని శైలజ ప్రేమించిందా లేదా ?? హరి తన ప్రేమ తో పాటు తన సోదరి ప్రేమను ఎలా గెలిపించాడు అనేది మిగతా కథ
సాంకేతికాంశాలు :
ఈ సినిమా కథ లో పెద్దగా కొత్తదనం లేకపోయినా , స్క్రీన్ ప్లే తో సినిమాను కొంతవరకు నడిపించాడు. మొదటి సగ భాగం హ్యుమరస్ డైలాగ్స్ తో సరదగా సాగుతుంది. సెకండాఫ్ లో కొంత సెంటిమెంట్ /ఎమోషన్ బాటలో సాగినా, ఎక్కడా మెలోడ్రామ ఎక్కువ కాకుండా బ్యాలన్స్ద్ గా సాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమా కు బాగా ఎస్సెట్ అయ్యింది, పాటల్లోనే కాకుండా కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ లో కుడా దేవి తన ప్రతిభ చూపించాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్ . డైలాగ్స్ చాలా హ్యుమరస్ గా పంచ్ డైలాగ్స్ కోసం మాట్లాడుకొనేలా కాకుండా, సందర్భానికి తగ్గటు సమకూరాయి
నటీనటుల పెర్ ఫార్మెన్స్ విషయానికొస్తే రాం తన ఇదివరకు సినిమాలలా కాకుండా ఎక్కడా ఓవర్ ప్లే చెయ్యకుండా సటిల్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ తెర మీద క్యూట్ గా కనిపించటమే కాకుండా, మంచి పెర్ ఫార్మెన్స్ కనపరచింది . ప్రిన్స్ హిరొ గా కాకుండా హిరో బావ గా కొత్తగా కనిపించాదు. సత్య రాజ్ , రోహిణి, నరేష్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు
మొత్తం మీద సినిమా కథ రోటిన్ కథ అయినా,,స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా పాత వాసనలు కొట్టినా , మొత్తం మీద ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషనల్ జర్నీ కూడా ఇవ్వగలిగాడు. చివర్లో కొంచెం సాగతీత అనిపించినా మిగతా సినిమా అంతా బాగుంది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ నేను కూడా మాస్ హీరో ని అని చెప్పుకోవటం కోసం పెట్టిన్నట్లు ఉండే ఫైట్ సీక్వెన్స్ , దాని కోసం అల్లిన సీన్స్ సినిమాకు సెపరేట్ గా పెట్టిన ప్యాచ్ లా కనిపిస్తాయి తప్ప, కథ కి సింక్ అవ్వవు, ఇకనైనా ఫైట్స్ ఉండటం కంపల్సరీ కాదు అని దర్శకులు తెలుసుకుంటే బాగుంటుంది
రేటింగ్ : 3.25/5
– మోహన్ .రావిపాటి
please share it..
No comments:
Post a Comment