ప్రతి పండక్కి వరుస సినిమాలు విడుదల కావడంలో, అందులో ఒకటో, రెండో బాక్సాపీస్ ని అలరించటం జరుగుతాయి. ఆ తరువాత మీడియా వారు ఆ పండుక్కి సంబంధించి టాప్ మూవీస్ గా ప్రత్యేకమైన స్టోరీలను టెలికాస్ట్ చేస్తారు. అలాగే తాజాగా దసరా పండుక్కి రిలీజ్ అయిన మూవీలలో ఏ మూవీ పండుగ మూవీగా నిలిచిందంటూ ప్రముఖ ఛానల్ కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఇందులో చరణ్ కి చుక్కెదురయింది. చరణ్ నటించిన బ్రూస్ లీ మూవీ దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందకు వచ్చింది. అయితే బ్రూస్ లీ సక్సెస్ అనేది అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ మూవీకి ‘దసరా హిట్’ అనే ట్యాగ్ రాలేదు. ఇక ఆ తరువాత రిలీజ్ అయిన కంచె, కొలంబస్, రాజుగారి గది వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆధరణ పొందాయి. వీటిలో కంచె, రాజుగారి గది మూవీలు బాక్సాపీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇంకేముంది దసర హీరోలుగా కంచె, రాజుగారిగది మూవీలు నిలిచాయి. విభిన్న కథాంశంతో వచ్చిన ఈ రెండు మూవీలు బాక్సపీస్ వద్ద మంచి విజయాన్ని చేజిక్కించుకున్నాయి. కంచె మూవీ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో వచ్చి అలరిచింది. అలాగే సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా రాజుగారిగది మూవీ ప్రేక్షకుల మన్నన్నలను పొందింది. మొత్తంగా ఈ దసరా పండుగ చిన్న మూవీలకి చేజిక్కిందని చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?
కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...
-
An intriguing report this week suggests that Samsung may be imitating the iPhone range when the Galaxy Note 8 hits the stores. With Samsun...
No comments:
Post a Comment