బాలీవుడ్ సినిమా 30 సెకన్లలో డౌన్‌లోడ్ అయిపోతుంది…వినడానికి ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది కదూ…ఇది నిజమే. రిలయన్స్ జియో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న 4జీ నెట్‌వర్క్ పనితీరులో డౌన్‌లోడ్ స్పీడ్ 70 ఎంబీపీఎస్‌ను తాకింది. ఈ స్థాయి స్పీడ్‌లో బాలీవుడ్ మూవీ సైజున్న వీడియో అర నిముషంలోనే డౌన్‌లోడ్ అవుతుంది. ముంబైలో ప్రత్యక్షంగా చేపట్టిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని, స్పీడ్ ఆకట్టుకునే రీతిలో ఉందని బ్రోకరేజ్ కంపెనీ క్రెడిట్ సూసే వెల్లడించింది.
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 4జీ సర్వీసుల సాఫ్ట్ లాంఛ్ ధీరూభాయి అంబానీ పుట్టిన రోజు అయిన డిసెంబరు 28న ప్రారంభం కానుంది. రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఉద్యోగులకు, వారి స్నేహితులకు 25 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్లతోపాటు 4జీ కనెక్షన్లను ఇచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే.
అర కిలోమీటరుకు ఒక టవర్ చొప్పున దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో 18,000 పట్టణాలు, నగరాల్లో 4జీ సర్వీసులను పరిచయం చేయనుంది. ఇప్పటికే సంస్థ రూ.95,000 కోట్ల దాకా వ్యయం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోసహా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ 80 శాతం పూర్తి అయినట్టు సమాచారం. రిలయన్స్ జియో సొంత మొబైల్ బ్రాండ్ అయిన ‘లైఫ్’ కింద ఎర్త్, వాటర్, విండ్, ఫైర్ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది. వీటి ధరల శ్రేణి రూ.4-25 వేలు ఉండనుందని సమాచారం. please share it..
No comments:
Post a Comment