ఇద్దరి మధ్య ఎప్పుడూ స్పర్థలు రాకూడదు.. వస్తే వెంటనే వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి.. లేకపోతే మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశించి.. ఇద్దరి మధ్య దూరాన్ని శాశ్వతంగా తెంచేయడానికి ప్రయత్నిస్తాడు.. ఇప్పుడు నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య కోల్డ్‌వార్ రాజకీయ రంగు పులుముకుంటోంది.. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్‌చల్ చేసేలా చేస్తున్నారు.
బాలయ్యపై తీవ్రాతితీవ్రమైన అభిమానాన్ని కలిగిన వారు… సినిమాల విషయంలో నందమూరి ఫ్యామిలీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇప్పుడు `టార్గెట్ చిన్న ఎన్టీఆర్` అంటున్నారు. ”రాసి పెట్టుకోండి.. ఇది నందమూరి నామ సంవత్సరం.. అనే జోక్‌తో ఎన్టీఆర్ ఈ సంవత్సరాన్ని ప్రారంభించాడు… పేర్లు చెప్పుకుని బతకడం ఏ రోజూ నేర్పలేదు మా నాన్న.. ఈ జోక్‌తో హరికృష్ణ ఈ సంవత్సరాన్ని ముగించాడు…“ అంటూ ఒకరు.. ” ఆ గుడివాడోడు నోటికి వచ్చిన బూతులు తిడతాడు…నువ్వేమో కట్టే కాలే దాకా తెలుగుదేశం అంటావ్.. లోకేష్ నా సినిమా ఆపాడు, బాలకృష్ణ డిస్ట్రిబ్యూటర్ లకి ఫోన్ చేస్తున్నాడు, చంద్రబాబు సినిమా నిర్మాతలతో టెలి కాన్ఫరెన్స్ చేసి నా సినిమా ఆపాడు అని ఏడుస్తావ్…నువ్వు తెలివిగల వాడివి అనుకున్నా, నీ స్నేహితుడు జగన్ టైపు నువ్వు కుడా….నీ ఖర్మ…“ ఇలా.. ఇంకోటి.. నందమూరి అభిమాని ఆవేదన పేరుతో మరో ఆసక్తికరమైన పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ కు ఉన్న అభిమాన బలగాన్ని నిలబెట్టుకున్నది బాలయ్యేనని, బాలయ్య లేకపోతే ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ లను పట్టించుకునే నాథుడే ఉండడని.. ఒకవేళ బాలయ్యే లేకపోతే ఎన్టీఆర్ మనవళ్ల పరిస్థితి అలాగే ఉంటుందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు బాబాయ్ నామస్మరణ చేయబట్టే వాళ్లను అభిమానించామని, ఇన్ని రోజులూ నందమూరి ఫ్యాన్స్ గా ఉన్నాం.. ఇకపై కేవలం బాలయ్య ఫ్యాన్స్ గా మాత్రమే ఉంటామనేది ఈ పోస్టు సారాంశం. నందమూరి భావోద్వేగాల నుంచి వీలైనంతగా ఎన్టీఆర్ ను దూరం చేయాలి.. అభిమానుల దృష్టిలో అతడు తప్పు చేస్తున్నాడనే ఫీలింగ్ ను కలిగించే లక్ష్యంతో వ్యూహాన్ని అమలు పెట్టాలనేది ఆలోచనట. అందుకు ఫేస్ బుక్ లో ఎన్టీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏదైనా కానీ అభిమానం హద్దులు దాటనంతవరకు బాగానే ఉంటుంది.. ఇలా అభిమాన హీరో కోసం ఫేస్ బుక్ గోడల్ని వాడుకుని యుద్ధం చేయటం ఎవరికి శ్రేయస్కరం కాదు..
please share it..
No comments:
Post a Comment