స్టార్ హీరోని చెడగొడుతున్న రానా

80145012012010

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై బిటౌన్ లో ఓ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్, పూర్తిగా రానా మాయలో పడిపోయాడని అంటున్నారు. వీరిద్దరి కలిసి గతంలో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఇప్పుడు వరుస చిత్రాలు బయటకు రానున్నాయి. ఇప్పటికే బాహుబలి’ సినిమాతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న రానా, బాలీవుడ్ లోనూ క్రేజ్ ని తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అందుకే సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి ‘పోస్టర్ బాయ్స్’ అనే సినిమాను నిర్మించనున్నాడు. ఇదే విషయాన్ని ఇప్పటికే అక్షయ్ కుమార్, రానా ఇద్దరూ సినిమాను అనౌన్స్ చేశారు. ఓ మరాఠీ సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ విశేషాలను చూస్తే ‘పోస్టర్ బాయ్స్‌’కు గోపీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక డార్లింగ్ స్వామి స్క్రిప్ట్ కి రెడీ చేస్తున్నాడు. ఇక రానా, అక్షయ్ కుమార్ ఇద్దరూ కలిసి ఈ సినిమా చేయడమే కాకుండా, ఈ మూవీకి వీరే సొంత నిర్మాతలు కావటం మరో విశేషం. ఇంతటితో వీరి జర్నీ ఆగకుండా, తెలుగులో అక్షయ్ కుమార్ తో ఓ మూవీని చేయనున్నాడు. ఇందులోనూ రానా మరో హీరోగా ఉండనున్నాడు. అలాగే అక్షయ్ కుమార్ ఇప్పటికే రజనీ కాంత్ ‘రోబో 2’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత హీరో విజయ్ మూవీలోనూ అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని అంటున్నారు. అయితే సౌత్ మార్కెట్ లో అక్షయ్ కుమార్ ఎక్కువ సినిమాల్లో నటిస్తే, తనకి బాలీవుడ్ లో మార్కెట్ పడిపోతుందని అంటున్నారు. దీంతో అక్షయ్ కుమార్ ని రానా పూర్తిగా చెడగొడుతున్నాడని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌