శంకర్ మాటని కాదన్న రజనీకాంత్

0817485802101

స్టార్ డైరెక్టర్ శంకర్ మాటని రజనీకాంత్ కాదని చెప్పుకొచ్చాడంట. ఇదంతా శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 మూవీ విషయంలో జరిగింది. ‘విక్రమ సింహ’, ‘లింగ’ లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత రజనీ కాంత్ తరువాతి చిత్రాలపై పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో డైరెక్టర్స్ పై నమ్మకంతో వారు ఏది చెబితే అది చేసుకుంటూ వచ్చాడు. ఇఫ్పడు మాత్రం తన నిర్ణయాలకి అనుగుణంగా డైరెక్టర్స్ ని మార్చుకుంటున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కబాలి’, ‘రోబో 2.0’ అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు. రజనీ కెరీర్లో ప్రభంజనం సృష్టించిన ‘రోబో’కి సీక్వెల్ గా ‘రోబో 2.0’ తెరకెక్కుతుంది. అలాగా దర్శకుడి పా రంజిత్ తెరకెక్కిస్తోన్న మరో గ్యాంగ్‌స్టర్ సినిమా ‘కబాలి’ లోనూ రజనీకాంత్ నటిస్తున్నాడు. అయితే త్వరలోనే ‘రోబో 2.0’ సెట్స్‌ పైకి వెళ్ళటానికి రెడీగా ఉంది. అలాగే ‘కబాలి’ మూవీ ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. మలేషియాలో మిగిలిన షెడ్యూల్ ని కబాలి పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ పూర్తయిన తరవాత వెంటనే రోబో2.0 మూవీలో నటించాల్సిందిగా రజనీకాంత్ ని శంకర్ కోరాడు. అందుకు రజనీకాంత్, శంకర్ కి నో చెప్పాడంట. ఎందుకంటే కబాలి సినిమా కంప్లీట్ షూటింగ్ అయిన పోయిన తరువాత కనీసం 15 రోజుల గ్యాప్ ని రజనీకాంత్ కోరకున్నాడు. ఆ తరువాతనే 2.0 మూవీలో నటిస్తాడంట. కబాలి షూటింగ్ పూర్తయిన వెంటేనే మళ్ళీ రోబో సీక్వెల్ లో నటించాలంటే కష్టం, తన వల్ల కాదని శంకర్ కి రజనీ క్లారిటి ఇవ్వటంతో ఇప్పుడు శంకర్ అశ్ఛర్యపోయాడు. దీంతో రజనీకాంత్ కి సంబంధించిన రోబో 2.0 షెడ్యూల్స్ ని రీ డిజైన్ చేసేందుకు శంకర్ రెడీ అయ్యాడు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌