త్రివిక్రమ్ సీరియస్ అయ్యాడు ఎందుకు?

trivikram-567

కొన్ని నెలలుగా చూస్తే, త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘అ..ఆ’ పై మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ అనుకున్న టైం కి రిలీజ్ కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నిషియన్స్ కొరత ఉంది..కథ సరిగా రాలేదంట…వంటి ఎన్నో అనుమానాలు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అ..ఆ’ మూవీపై ఉన్నాయి. నితిన్, సమంతా, అనుపమ పరమేశ్వరన్ కాంబినేష్ లో ఈ మూవీ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. అలాగే ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవంగా రావాల్సి ఉండగా, ఇప్పుడు ఈ మూవీ ఆ రిలీజ్ డేట్ ని మార్చుకుంది. ఇందుకు ‘అ..ఆ’ మూవీకి అసలు మ్యూజిక్ డైరెక్టర్ అనే వాడే లేడని అంటున్నారు. అలాగే సమంత సైతం తన కాల్షీట్స్ ని ‘అ..ఆ’ మూవీకి ఎక్కువుగా కేటాయించలేకపోతుందని అంటున్నారు. ఓ రకంగా చూస్తే పేరుకి త్రివిక్రమ్ మూవీ అనే కానీ, ఈ మూవీపై అంతటా నెగిటివ్ ప్రచారమే జరుగుతుంది. చిత్ర యూనిట్ ఎప్పటికప్పడు అప్ డేట్స్ ని బయటకు చెబితే కానీ…బయటకు వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉంది? అనేది తెలియదు. అయితే ఈ నెగిటివ్ పబ్లిసిటి వివరాలను తెలుసుకున్న త్రివిక్రమ్, తాజాగా తన టీంపై సీరియస్ అయ్యాడంట. ఇకనైనా ఇలాంటివి రాకుండా ఉండాలని చెప్పుకొచ్చాడంట. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ఇందులోనూ క్లారిటీ లేదని అంటున్నారు.

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features

Top 5 Free Screen Recording Softwares For Windows

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away