గుణశేఖర్ కి అన్యాయం చేసి వెళ్ళారా?

gunasekar-967

కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే తోడుగా ఉంటారో? వారే వారికున్న అసలైన బలం అని అంటారు. కానీ ప్రతిసారి కష్టాల్లో ఉంటే మాత్రం మిగిలిన వారు కూడ ఏం చేస్తారు. తలోదారి పడతారు. ఇప్పుడు దర్శకుడు గుణశేఖర్ పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో గుణశేఖర్ నుండి వచ్చిన సినిమాలు అట్టర్ ప్లాప్ గా నిలిచాయి. అయితే రుద్రమదేవి మూవీ మాత్రం తనకు మంచి లాభాలనే తీసుకువచ్చింది. కానీ ఈ మూవీ ఆర్ధికంగా విజయం సాధించినప్పటికీ, తన దగ్గర ఉన్న టీం మాత్రం గుణశేఖర్ ని వదిలి వెళ్ళిపోయిందని అంటున్నారు. అందుకే గుణశేఖర్ తాజాగా తన దర్శకత్వంలో రాబోయే చిత్రానికి అప్రెంటీస్, అసిస్టెంట్లు కావాలని అఫిషియల్ గానే చెప్పాడు. గతంలో గుణశేఖర్ వద్ద మంచి టీం ఉండేది. వారు ఒక్కక్కరిగా బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం గుణశేఖర్ వద్ద టీం అంతా ఖాళీ అయిపోయిందట. తను మాత్రమే ఒంటరిగా మిగలాడని అంటున్నారు. దీంతో మళ్ళీ తన టీంను ఫాం చేసేందుకు గుణశేఖర్ ప్రయత్నస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ తాజా చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేయడానికి అసిస్టెంట్లు చాలామంది కావాలని చెబుతున్నారు. మరి ఎంత మంది గుణశేఖర్ వద్ద ఉన్న ఒత్తిడిని తట్టుకొని పనిచేయగలరో చూడాలి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌