కాపులు నిజం తెలుసుకోండి

484504520120

ఓ నేర‌గాడు త‌న స్వార్ధం కోస‌మే తునిలో విధ్వంసం సృష్టించార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. తుని కాపు గ‌ర్జ‌న‌ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సంఘ‌ట‌న వెన‌క పిల్ల కాంగ్రెస్ (వైకాపా), త‌ల్లి కాంగ్రెస్ (కాంగ్రెస్‌) ఉన్నాయ‌ని ఆయ‌న‌ మండిప‌డ్డారు. విధ్వంసం సృష్టిస్తే న‌ష్ట‌పోయేది ఎవ‌రో ఒక్క‌సారి కాపులు ఆలోచించుకోవాల‌ని చంద్ర‌బాబు అన్నారు.
కాపుల‌ను బీసీల్లో చేర్చేందుకు తాము సుముఖంగా ఉన్నామ‌ని, దీనిపై పూర్తిగా స‌మీక్షించిన త‌రువాత నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న బీసీల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాల్సి ఉంద‌న్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో కాపుల‌కు ఎప్పుడైనా న్యాయం జ‌రిగిందా..కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేశారా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఒక నేర‌గాడు ప‌దే ప‌దే రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ప‌రోక్షంగా జ‌న‌గ్‌ను విమ‌ర్శించిన చంద్ర‌బాబు ఆయ‌న తండ్రి ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఎందుకు క‌ల్పించ‌లేదు. ? ఈ విష‌యాల‌న్నీ కాపులు గుర్తుకు తెచ్చుకోవాల‌న్నారు. ఆ నేర‌గాడి మాయ‌లో కాపులు ప‌డ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు సూచించారు.
మీడియా స‌మ‌వేశంలో ఎక్క‌డా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌, వైకాపా నేత జ‌గ‌న్ అని పేరు ప్ర‌స్తావించ‌ని చంద్ర‌బాబు ప‌రోక్షంగా ఆయ‌న‌పై నిప్పులు చెరిగారు. తుని ఘ‌ట‌న‌ల‌కు ఓ నేర‌స్థుడే కార‌ణ‌మంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రాష్ట్టం ఏ ఒక్క నేర‌స్థుడిది కాదు.. ఐదు కోట్ల ప్ర‌జ‌ల‌ది. 1994, 1999 ఎన్నిక‌ల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని టీడీపీ హామీ ఇవ్వ‌లేదు. కాపులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌నే విష‌యాన్ని గ్ర‌హించి మొన్న‌టి ఎన్నిక‌ల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని తాము హామీ ఇచ్చామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. వాళ్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన విధానం ద్వారా న్యాయం చేస్తామ‌ని…. కాపుల‌కు మేలు జ‌రిగేలా అంద‌రితో మాట్లాడి ప‌రిష్కారం క‌నుగొనే దిశ‌గా ముందుకు పోతున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...