సోన‌మ్‌ను కంగారు పెడుతున్న అమీర్‌ఖాన్‌

90560520120

హీరో పేరు.. సినిమా పేరు ఒక‌టే అయితే ఆ సినిమా.. ప్లాప్‌! త‌న సినిమా ప్రారంభోత్స‌వానికి మ‌హేష్‌ రాడు.. వస్తే ఆసినిమా స‌రిగ్గా ఆడ‌ద‌ట‌!! త‌న సినిమాలో ఒక చిన్న స‌న్నివేశంలో అయినా.. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల క‌నిపిస్తాడు. లేక‌పోతే ఆ సినిమా విజ‌యం సాధించ‌ద‌ని న‌మ్మ‌క‌మ‌ట‌!! ఇవ‌న్నీ టాలీవుడ్‌లో ఉన్న కొన్ని సెంటిమెంట్లు. ఏ ఇండస్ట్రీ అయినా.. సెంటిమెంట్ల‌కు కొద‌వే లేదు! దీపావ‌ళికి త‌న సినిమాలను త‌ప్ప‌క విడుద‌ల చేస్తుంటాడు షారూఖ్!! ఇలాగే ఇప్పుడు ఇంకో సెంటిమెంట్ బాలీవుడ్‌లో చక్కెర్లు కొడుతోంది. అదే బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కనుక ఏదైనా ప్రివ్యూ షో లో ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకుంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందట. ఇప్పుడు ఈ కంట‌త‌డి చూసి ఒక బాలీవుడ్ హీరోయిన్ కంగారు ప‌డుతోంద‌ట‌!
సల్మాన్ ఖాన్ సినిమా భజరంగీ భాయిజాన్ విషయంలో అలా జరిగిందని ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ తరవాతే అసలు చిక్కొచ్చిపడింది. అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హీరోగా నటించిన కట్టి బట్టి సినిమా ప్రివ్యూలో కూడా అమీర్ ఏడ్చాడట. కానీ సెంటిమెంట్ కి భిన్నంగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. కొంతమంది ఆ సమయంలో కట్టి బట్టి ఫ్లాప్ మీద జోక్ లు కూడా పేల్చారు. మేనల్లుడి యాక్షన్ చూడలేక, దాన్ని భరించలేక “భగవంతుడా… ఇలాంటి యాక్టింగ్ రాని వాణ్ని నా మేనల్లుడిగా ఎలా పుట్టించావంటూ” ఏడ్చాడని, కానీ అక్కడున్న వాళ్ళు “సినిమా చూసి ఇంప్రెస్ అయి ఏడ్చాడని” తప్పుగా అర్థం చేసుకున్నారని లాజిక్ తీశారు. ఇప్పుడు విషయం ఏంటంటే సోనమ్ కపూర్ హీరోయిన్ గా `నీరజ` అనే సినిమా వస్తోంది. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రివ్యూ లో కూడా అమీర్ ఏడ్చాడట. దీంతో ఈ సారి అమీర్ సెంటిమెంట్ ఏవిధంగా రిజల్ట్ చూపిస్తుందో అని బాలీవుడ్ అంతా కంగారుగా `నీరజ` సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తోందట.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌