పూరీకి దెబ్బ మీద దెబ్బ

98056050120

ఓ రేంజ్ స్టార్ డం కి వెళ్లిన సెలబ్రిటీలకి వారు ఏం చేస్తున్నారో వారికి అస్సలు తెలియదని అంటుంటారు. అందుకు కారణం వారు సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవ్వటమే. అటువంటి సమయంలో ఇతరులు చెప్పే విషయాలకి ఏ మాత్రం ప్రాధాన్యతని ఇవ్వరు. ఇది అందరి జీవితాల్లో సహజంగా జరిగే విషయమే. ఇప్పుడు పూరీ జగన్నాద్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. వరుణ్‌ తేజ్‌ తో లోఫర్‌ సినిమా తరువాత పూరీ రోగ్‌ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఆ మధ్య విపరీతమైన ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ మూవీ ఎక్కడా ఆగిపోలేదనేది నిజం. కాకపోతే ఈ మూవీపై గాసిప్స్ మాత్రం ఆగిపోవటం లేదు. ఇదిలా ఉంటే పూరీకి పెద్ద హీరోల విషయంలో మంచి డిమాండ్ ఉండగానే..వారితో మూవీలను తీయటం ఆపేసి చిన్న హీరోలతో మూవీలను తీయటం మొదలు పెట్టాడు. ఈ మధ్యకాలంలో పూరీ ఎక్కువుగా తీసిన చిత్రాలు చిన్న కాంబినేషన్ చిత్రాలే. ఈ మూవీలలో విజయాన్ని అందుకుంటాయా? అంటే అదీ లేదు. అందుకే పూరీ కి గతంలో చాలా మంది పెద్ద హీరోలతోనే మూవీలని తీయి మహా ప్రభో…అని సన్నిహితులు సైతం చెప్పుకొచ్చారంట. కాకపోతే పూరీ ఆ మాటలు పక్కన పెట్టి ఇప్పుడు చిన్న హీరోలతో సినిమాలను మొదలు పెట్టుకొని అవి రిలీజ్ కాక, రిలీజ్ అయినా పూరీ పేరుకి పూర్తి డామేజ్ ని తెస్తున్నాయి. ఇలా దెబ్బ మీద దెబ్బతో పూరీ ఇరుకున పడ్డాడని తెలుస్తుంది. ఇకనైనా పూరీ పెద్ద హీరోలతోనే పెట్టుకుంటే మళ్ళీ తను ఫాంలోకి వస్తాడని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...