కృష్ణాష్ట‌మికి దిల్ రాజు రివ్యూ ఇదే !

56905620230

టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తుందంటే ఇండ‌స్ర్టీలోను, టాలీవుడ్ ట్రేడ్ స‌ర్కిల్స్‌లోను భారీ అంచ‌నాలే ఉంటాయి. కథను నమ్మి సినిమాను నిర్మించడం వరకు ఓకే.. కాని తన సినిమాకు రేటింగ్ ఇదే అని ప్రొడ్యూసర్ నేరుగా చెప్పడం వింతనే చెప్పాలి. ఆయ‌న తాజాగా నిర్మించిన కృష్ణాష్ట‌మి సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా దిల్ రాజు రివ్యూవ‌ర్ల‌పై ఓ రేంజ్‌లో విరుచుకు ప‌డ్డాడు. సినిమా బాగున్నా రివ్యూవ‌ర్లు స‌రిగా రేటింగ్ ఇవ్వ‌ట్లేద‌న్న రాజు ఇక‌పై త‌న సినిమాల‌కు ముందు రోజు తానే రివ్యూ రాసి పోస్ట్ చేసుకుంటాన‌ని కూడా ప్ర‌క‌టించాడు.
రాజు క‌మెడియ‌న్ సునీల్ హీరోగా నిర్మించిన ‘కృష్ణాష్టమి’ సినిమా ఫిబ్రవరి 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తన సినిమాకు ప్రేక్షకుల నుండి 3.5 నుండి 3.75 రేటింగ్ వస్తుందని బల్లగుద్ది చెబుతున్నాడు. ప్రొడ్యూసర్ గా తన సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో అలా మాట్లాడి ఉండొచ్చు గాని.. ప్రస్తుతం దిల్ రాజు కాస్త ఓవర్ చేస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. సునీల్ సినిమాకు ఆ రేంటింగ్ రావడం అంత సులభం కాదు.. అసలే సునీల్ కి ఈ మధ్య టైం బాలేదు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి సినిమా రిజల్ట్ గురించి కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాని దిల్ రాజు మాత్రం సినిమా సూపర్ హిsట్.. రేటింగ్ కూడా అంతొస్తుంది.. ఇస్తుంద‌ని చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే అనుకోవాలి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌