వెంకీకి ఇంత డిమాండ్ ఉందా?

04802458050

ఈ మధ్య కాలంలో తక్కవ సినిమాలతో బాక్సాపీస్ వద్ద అలరించిన హీరో వెంకటేష్. అందరి హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే, వెంకటేష్ మాత్రం తక్కవ చిత్రాలతో వస్తున్నాడు. ‘గోపాల గోపాల’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేష్, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మారుతి డైరెక్షన్ లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మారుతి మూవీలకి ప్రస్తుతం నిర్మాతల జేబులు నిండుకుంటున్నాయి. దీంతో మారుతి బ్రాండ్ చిత్రాలు భారీ డిమాండ్ పలుకుంతుంది. ఇక వెంకటేష్ చిత్రాలకి యూనివర్సల్ వ్యూవర్స్ బ్రాండ్ ఉండటంతో వీరి కాంబినేషన్ కి కచ్ఛితంగా ప్రేక్షక ఆధరణ ఎక్కువుగానే ఉంటుందని మార్కెట్ లో వినిపిస్తున్న టాక్స్. ప్రస్తుత సమాచారం ప్రకారం బాబు బంగారం సినిమా ఓవర్సీస్ డీల్ భారీ రేటు పలుకుతుంది. ఈ సినిమా రైట్స్ ని 2.5 కోట్లకి ఇప్పటికే కొన్నారు. అంతే కాకుండా ఈ అమౌంట్ ని ముందుగానే చెల్లించేందుకు ఒప్పందాలు జరిగాయి. బాబు బంగారం మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్..అలాగే షూటింగ్ కూడ పూర్తి కాకముందే ఓవర్సీస్ రైట్స్ క్లోజ్ కావటంతో ఈ మూవీపై మార్కెట్ లో భారీ డిమాండ్ ఉందని అంటున్నారు. వెంకీ ఓ కామెడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ, తనదైన మార్క్ తో ఎంటర్టైన్ చేయనున్నాడు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌