వారిని తీసుకొని ఖర్చు తగ్గించాడు

04980505010

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ మూవీకి దర్శకుడిగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పనిచేస్తున్నాడు. అయితే జనతా గ్యారేజ్ మూవీ విషయానికి వస్తే…ఈ మూవీలో నటిస్తున్న స్టార్ కాస్టింగ్ అంతా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన నటుల విషయంలో చిత్ర యూనిట్ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీపై పడింది. ఆ విధంగానే ఒక కొత్త విలన్ ని ‘జనతా గ్యారేజ్’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. మలయాళ చిత్రపరిశ్రమకి చెందిన ఆ నటుడి పేరు ‘ఉన్ని ముకుందన్’. ఈ సినిమాలో విలన్ గా ‘ఉన్ని ముకుందన్’ను ఇప్పటికే ఫైనల్ చేశారు. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ తో ఎన్టీఆర్ ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నాడు. మొత్తంగా జనత గ్యారేజ్ మూవీలో రెండు కీలక పాత్రల కోసం మలయాళ ఇండస్ట్రీ నుండే ఆర్టిస్ట్ లని తీసుకోవటం ఆసక్తిగా మారింది. ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయానికి వెళితే….మలయాళ స్టార్స్ కి చాలా తక్కువ రెమ్యునరేషన్ కి ఇవ్వొచ్చంట. అందుకే విలన్ విషయంలో కొత్తదనం అనే కోణంలో ఆలోచించి, బడ్జెట్ ని తగ్గించుకునేందుకు మలయాళ స్టార్ ని రంగంలోకి దింపారని అంటున్నారు. ఈ విధంగా మోహల్ లాల్, ఉన్ని ముకుందన్ లకి ఈ చిత్ర యూనిట్ కేవలం కోటి ముప్పై లక్షలు మాత్రమే ఖర్చు చేస్తుందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌