నితిన్ కి తండ్రి మొట్టికాయలు

840850450120

ఎవరైనా డబ్బుని కూడ బెట్టుకోవాలని చూస్తారు. కళ్ళ ముందు ఖర్చు చేస్తూ కూర్చోరు. ప్రస్తుతం నితిన్ చేతులారా డబ్బుని ఖర్చు పెడుతున్నాడంట. దీంతో తండ్రి సుధాకర్ రెడ్డి, నితిన్ కి మొట్టికాయలు వేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో నితిన్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. ‘అఖిల్’ సినిమా కి భారీ నష్టాలను చూశాడు నితిన్. ఇక తాజాగా సూర్య హీరోగా విక్రం కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ’24’ చిత్రాన్ని, తెలుగులో రిలీజ్ చేయడానికి నితిన్ రెడీ అయ్యాడు. ఈ మూవీ తెలుగు రైట్స్ ని కైవసం చేసుకోవటానికి ఫ్యాన్సీ రేటుకి సై అన్నాడు. ఎవ్వరూ ఊహించనంతంగా 24 మూవీ చిత్రాన్ని భారీ రేటుకి రైట్స్ ని దక్కించుకోవటం ఇక్కడ విశేషంగా మారింది. చాలా మంది నితిన్ ఆఫర్ చేసిన రేటు, టాలీవుడ్ మార్కెట్ ని మించి ఉందని అంటున్నారు. ఇది ఎందుకు చేశాడు అనే దానికి నితిన్ ఇచ్చుకున్న వివరణ అంత కరెక్ట్ కాదనే అంటున్నారు. నితిన్ కెరీర్ డైలమాలో ఉన్న సమయంలో ‘ఇష్క్’ తో బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు దర్శకుడు విక్రం కుమార్. ఇక ఇదే డైరెక్టర్ నుండి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ ‘మనం’ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ రెండు చిత్రాలతో డైరెక్టర్ విక్రమ్ కుమార్ వాల్యూ పెరిగింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేసిన తాజా చిత్రమే 24 మూవీ. ఈ మూవీకి హీరోగా చేసిన సూర్య కు తమిళం తో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. టైం మిషన్ వంటి సైంటిఫిక్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ ‘24’ మూవీపై సౌత్ లో భారీ క్రేజీ ఏర్పడింది. ఇక తెలుగు రైట్స్ ని దాదాపు 15 కోట్ల రూపాయలకి చేజిక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో సూర్య మూవీపై పెట్టడం సరికాదని తండ్రి సుధాకర్ రెడ్డి, నితిన్ కి మొట్టికాయలు వేశాడని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...