మన తెలుగు సినిమాల్లో హీరోలు విలన్లను కొడితే అంతే వాళ్లకు స్పృహ ఉండదు..కోమాలోకి వెళ్లిపోతారు. అయితే లండన్‌లో ఓ క్రూరమైన రేపిస్టు ఉన్నాడు. వాడు రేప్ చేసిన అమ్మాయిలు స్పృహలోకి కూడా రావడం లేదట. ఇప్పుడు ఆ క్రూరమైన రేపిస్ట్ గురించి బ్రిటన్ మొత్తం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ లండన్‌లోని ఓ ప్రాంతంలో ముగ్గురు యువతులను అతి కిరాతకంగా అత్యాచారం చేసిన వ్యక్తి గురించి చిన్న సమాచారం ఇచ్చినా పది లక్షల రూపాయాలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు లండన్ పోలీసులు. ఎందుకంటే ఆ ముగ్గురు యువతుల్లో ఎవరూ స్పృహలో లేరు.
గత బుధవారం అర్ధరాత్రి షాపింగ్ నుంచి తిరిగి వచ్చిన యువతులు తమ ఇంటికి వెళ్లేందుకు లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ఎక్కారు. తాము దిగవలసిన స్టేషన్ రాగానే వారు దిగిపోయి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో నడవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై దాడి చేశాడు. వారిపై పాశవికంగా విరుచుకుపడి అత్యాచారం చేశాడు. ఉదయం అందరూ చూసే సమాయానికి ఆ యువతులు అపస్మారక స్థితిలో నగ్నంగా పడి ఉన్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లండన్ పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారికి అతని గురించి ఎలాంటి సమాచారమూ లేదు. దీంతో ఆ అత్యాచారం జరిగిన చుట్టు పక్కల ప్రాంతాల్లో అతని గురించి విచారిస్తున్నారు. చిన్న సమాచారం ఇచ్చినా బహుమతి భారీగా ఉంటుందని ఆశ పెడుతున్నారు.
No comments:
Post a Comment