ఇండస్ట్రీలోని మెగాహీరోలకి ఓ లెక్క ఉంటుంది. ప్రతి మెగాహీరోకి ఈ లెక్క తప్పకుండా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఏదైతే నేర్చుకున్నాడో…దానినే ఇతర మెగాహీరోలు అంతా ఫాలో అవుతున్నారు. అందుకే ఇఫ్పటి వరకూ ఒక్క మెగాహీరో కూడ వారి మూవీలకి సంబంధించిన కమిట్మెంట్స్ లో ఎక్కడా లెక్క తప్పలేదు. కానీ ఇప్పుడు ఓ మెగా హీరో విషయంలో లెక్క తప్పటంతో… తన ప్లానింగ్స్ అంతా డిస్ట్రబ్ అయ్యాయని అంటున్నారు. వరుణ్ తేజతో అనుకున్న రెండు ప్రాజెక్టులు అనుకోని విధంగా కాన్సిల్ అయ్యాయి.
దీంతో వరుణ్ తేజ్ డైలమోలో పడ్డాడు. సరైన ప్లానింగ్ లేకపోవటమే ఇందుకు కారణం అని అంటున్నారు. రాయబారి చిత్రం బడ్జెట్ సమస్యలతో ఆగిపోతే.. గోపిచంద్ మలినేని కథ నచ్ఛక ఆగిపోయింది. ఇప్పుడే ఎదుగుతున్న వరుణ్ తేజ్…మూవీల సెలక్షన్స్ విషయంలో డైరెక్టర్, నిర్మాతలు, ఇతర కాస్టింగ్ వంటి వివరాలను పూర్తిగా తెలుసుకొని, కాన్ఫిడెంట్ గా ముందుకుపోవాల్సింది పోయి…ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్ కాదని అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే భారీxe నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫీల్ మై లవ్ అనే టైటిల్ తో ఓ మూవీకి రెడీ అయ్యాడు. దీనికి నిర్మాత దిల్ రాజు.
No comments:
Post a Comment