మొన్న నూడుల్స్ నేడు పాస్తా వివాదం

60780415204120120

నెస్లే ఇండియా సంస్థకు బ్యాడ్ టైం నడుస్తోంది. నిన్న మొన్నటి దాకా మ్యాగీ నూడుల్స్ చుట్టూ వివాదం చెలరేగి సంస్థను భారీ నష్టాల్లోకి నెట్టేస్తే.. ఇప్పుడు పాస్తా వివాదం రాజుకుని సంస్థను మరింత అధోగతి పాల్జేసేలా కనిపిస్తోంది. మొన్న‌టికి మొన్న మ్యాగీ నూడుల్స్ లో ఆరోగ్యానికి హాని కలిగించే మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్జీ) అనుమతించిన ప్ర‌మాణాలు కంటే అధిక మోతాదులో ఉంద‌ని కేంద్ర ఆహార భద్రత నియమాల సంస్థ తేల్చింది. దీంతో మ్యాగీని భారత ప్రభుత్వం కొన్ని నెలల పాటు మార్కెట్ కు దూరం చేశాయి. అటుపై అనేకానేక ప‌రీక్ష‌లు ఎదుర్కొని మ్యాగీ మార్కె ట్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. అంతా బాగుందనుకుని నెస్లే కంపెనీ భావిస్తున్న త‌రుణంలో పాస్తా వంతొచ్చింది. పాస్తాలో అధిక మోతాదులో సీసం పాళ్ళు ఉన్నాయంటూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా పరీక్షల్లో వెల్లడైంది. దీంతో నెస్లే ఇండియాకు కొత్త కష్టాలు దాపురిం చాయ్‌.
అబ‌ద్దం.. అంతా అబద్దం : నెస్లే
వాస్త‌వానికి మ్యాగీ ఉదంతం తర్వాత, విపరీతంగా ఆదరణ పొందుతున్న పాస్తాను కూడా పరీక్షించాలని నిర్ణ‌యించింది. దీంతో గత సెప్టెంబర్ లో ప్ర‌యోగ ప‌రీక్ష‌లు నిర్వహించగా.. పాస్తా ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తేలింద‌ని ఆహార భద్రత నియమాల సంస్థ యూపీ అధికారులు స్పష్టం చేస్తున్నా రు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు నెస్లే ఇండియా ప్ర‌తినిధులు మాత్రం యూపీ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని, తమ ఉత్పత్తులు అనేకానేక పరీక్షల అనంతరమే మార్కెట్లోకి వచ్చాయని చెబుతున్నారు.
please share it..

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...